‘పింక్’లో పాప మారింది.. ‘పూజా’ ఫిక్సయ్యింది!

టాలీవుడ్ పవర్‌స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారని గత కొన్నిరోజులుగా వార్తలు వెలువడిన విషయం విదితమే. అంతేకాదు.. సినిమాల్లో నటిస్తానో లేదో తెలియదని పవన్ చెప్పడం.. ఇక్కడేమో హిందీలో ఆ మధ్య విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ‘పింక్’ సినిమా రీమేక్ కోసం బడా నిర్మాతలైన దిల్ రాజు, బోనీ కపూర్ చకచకా ఏర్పాట్లు చేసేస్తున్నారు. అధికారిక ప్రకటనలు కూడా ఇప్పటికే వచ్చేశాయ్ కూడా. దీంతో పవన్ వీరాభిమానులు, జనసేన కార్యకర్తల్లో భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి.. అవన్నీ ఇక్కడ అప్రస్తుతం.. అసందర్భం కూడా.
అయితే ఈ సినిమా ఎవరు తెరకెక్కిస్తారు..? పవన్ సరసన నటించబోయే ముద్దుగుమ్మ ఎవరు..? అసలు ఈ సినిమా నిజంగానే పట్టాలెక్కుతుందా..? లేదా అనే అనుమానాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయ్. ఈ క్రమంలో మెగాభిమానులకు సూపర్ హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు చిన్నపాటి హింట్ ఇచ్చి ఎస్.. సినిమా రీమేక్ చేస్తున్నామన్నట్లుగా సిగ్నల్ ఇచ్చాడు. అదేమిటంటే.. మూడో కంటికి తెలియకుండా హీరోయిన్ను వెతికే పనిలో ఆయన ఉన్నారట.
ఎవరైతే పవన్‌తో రొమాన్స్‌కు సెట్ అవుతారా అని వెతికిన దర్శకుడు శ్రీరామ్ వేణు, నిర్మాత దిల్‌రాజు మొదట స్టార్ హీరోయిన్ నయనతార అనుకోగా.. తర్వాత మనసు మార్చుకుని పూజా హెగ్దేని ఫిక్స్ చేశారట. ఇందుకు కారణం.. టాలీవుడ్లో ప్రస్తుతం టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలుతుండటమేనట. ఈ విషయమై పూజాను సంప్రదించగా పవర్ స్టార్ సరసన నేనా.. అయితే ఓకే అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. ఇప్పటికే మెగా హీరోలు రామ్‌చరణ్, వరుణ్ తేజ్ సరసన నటించిన ఈ భామ.. పవన్ సరసన నటిస్తోందని వార్తలు వస్తున్నాయ్. అంటే మెగా అబ్బాయ్‌లు అయిపోయారు.. ఇక బాబాయ్‌తో పూజా రొమాన్స్ చేయనుందన్న మాట. ఈ కొత్త కబుర్లలో ఏ మాత్రం నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ వేచి చూడాల్సిందే మరి.
By November 07, 2019 at 04:56AM
No comments