Breaking News

ఎమ్మెల్యేగా శ్రీరెడ్డి పోటీ.. ఆ హీరోతో అంతా తూచ్!


టాలీవుడ్ వివాదాస్పద నటి శ్రీరెడ్డికి.. తమిళనాడు మాజీ సీఎం మనువడు ఉదయనిధి స్టాలిన్‌కు సమ్‌థింగ్ సమ్‌థింగ్ అని ఓ ఫేస్‌బుక్ పోస్ట్ నెట్టింట్లో వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే.. వామ్మో శ్రీరెడ్డి మరొకరి బాగోతం బయటపెట్టిందని వెబ్‌సైట్లు.. మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వెలువడ్డాయి. అయితే ఈ వ్యవహారంపై తాజాగా శ్రీరెడ్డి స్పందిస్తూ.. అబ్బే అదేం లేదు.. అంతా తూచ్.. అంటూ మాజీ సీఎం మనువడి వ్యవహారంపై  చెన్నైలో  ప్రెస్ మీట్ పెట్టి మరీ క్లారిటీ ఇచ్చుకుంది. 

అదంతా అబద్ధమే..!

‘ఉదయనిధిపై ఫేస్‌బుక్‌ పోస్టు ద్వారా చేసిన ఆరోపణల్లో నిజం లేదు. నేను ఆరోపణలు చేసినట్లు వచ్చిన ఫేస్‌బుక్‌ పోస్టులో అన్నీ అవాస్తవాలే. అసలు ఉదయనిధిని నేను ఎప్పుడూ నేరుగా చూడలేదు. ఉదయనిధిని నేను నేరుగా చూసిన సందర్భంమే లేదు. ఆయన గురించి వచ్చిన పోస్టు.. నా అధికార ఫేస్‌బుక్‌ ఖాతాది కాదు. కరుణానిధి కుటుంబంపై నాకు గౌరవం ఉంది. అది ఓ నకిలీ ఖాతా. కావాలనే ఎవరో పనిగట్టుకుని ఆ పోస్ట్ చేశారు. నా పేరిట సోషల్ మీడియాలో పలు నకిలీ ఖాతాలు ఉన్నాయి. ఇందుకు సంబంధించి సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేశాను. నేను అవకాశాల కోసం తప్పులు చేశానని.. ప్రస్తుతం వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తున్నాని అయితే భవిష్యత్తులో అలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటాను. ఇక్కడ తమిళ ప్రజలు ఆదరిస్తున్నారు. త్వరలోనే రాజకీయాల్లో వస్తున్నాను. నన్ను ఆదరిస్తున్న తమిళ ప్రజలకు సేవ చేయాలని అనుకుంటున్నాను. ఓ ప్రముఖ పార్టీలోకి చేరుతున్నాను. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ సంపాదించి పోటీ చేస్తాను. అయితే ఎక్కడ్నుంచి పోటీ చేయబోయేది త్వరలోనే చెప్తాను’ అని శ్రీరెడ్డి చెప్పుకొచ్చింది. సినిమాల్లోనే రాణించలేకపోయిన శ్రీరెడ్డి.. రాజకీయాల్లో ఏ మాత్రం రాణిస్తుందో మరి.

ఫేస్‌బుక్‌ పోస్ట్‌లో ఏముంది..!?

‘హాయ్ తమిళ్ యాక్టర్ ఉదయనిధి స్టాలిన్ సార్..మూడేళ్ల క్రితం హైదరాబాద్‌లో జరిగిన సినిమా షూటింగ్‌లో విశాల్ నుంచి స్టాలిన్‌ను కలిసాను. ఆ తర్వాత అవకాశం ఇప్పిస్తానని చెప్పి... గ్రీన్ పార్క్ హోటల్‌లో రాత్రంతా అతనితో లైంగికంగా కలిసాను. అంతేకాదు.. ఆ రాత్రంతా ఎన్నో ఎన్నెన్నో చేశాం కదా స్టాలిన్ గారూ.. కానీ ఇప్పటి వరకు మీరు నాకు ఛాన్స్ ఇవ్వలేదు. ఆ రోజు మీరు నేను గడిపిన ఆ రాత్రి అస్సలు మరిచిపోరేమో..?’ అంటూ శ్రీరెడ్డి పేరిట ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ కలకలం రేపిన విషయం విదితమే.



By November 18, 2019 at 06:32AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/48318/sri-reddy.html

No comments