యువకుడితో ముగ్గురు పిల్లల తల్లి అక్రమ సంబంధం.. చివరికిలా..

ప్రేమ గుడ్డిది అంటారు పెద్దలు. కొన్ని ఘటనలు చూస్తే అది నిజమేమో అనిపిస్తుంటుంది. ముగ్గురు పిల్లల తల్లి అయిన మహిళ, అవివాహితుడైన యువకుడు ప్రేమలో పడటం, కలిసి బతికే అవకాశం లేకపోడంతో వారిద్దరూ ఆత్మహత్యకు పాల్పడటం కర్ణాటకలో విషాదం నింపింది. Also Read: గదగ జిల్లా రోణ తాలూకా హీరేహాళ్ల గ్రామానికి చెందిన ఈరమ్మ అనే మహిళకు కొంతకాలం క్రితం వివాహమైంది. ఆమెకు ముగ్గురు సంతానం. భర్త తాగుడుకు బానిసై ప్రాణాలు కోల్పోవడంతో కూలిపనులు చేసుకుంటూ పిల్లలను పోషిస్తోంది. ఈ క్రమంలోనే ఆమెకు ఆర్టీసీ డ్రైవర్ అయిన శంకరగౌడ అనే యువకుడితో పరిచయం ఏర్పడి అక్రమ సంబంధానికి దారితీసింది. వీరిద్దరూ కొద్దిరోజులుగా సహజీవనం సాగిస్తున్నారు. Also Read: ఇటీవల శంకరగౌడకు తల్లిదండ్రులు ఓ యువతితో వివాహం నిశ్చయించారు. మరో 15రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉంది. పెళ్లి చేసుకుంటే ఈరమ్మతో కలిసి ఉండటం కుదరదని అతడు తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఆమె లేని బతుకు తనకొద్దనుకొన్నాడు. దీంతో ఈరమ్మ, శంకరగౌడ శుక్రవారం గ్రామ శివారులో ఒకే చెట్టుకు ఉరేసుకున్నారు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రోణ పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. మరో 15రోజుల్లో పెళ్లిపీటలెక్కాల్సిన కొడుకు ఆత్మహత్య చేసుకోవడంతో శంకరగౌడ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. Also Read:
By November 17, 2019 at 12:00PM
No comments