Breaking News

పదేళ్ల బాలికపై అత్యాచారం.. చిత్తూరు జిల్లాలో మరో ఘోరం


జిల్లాలో మరో ఘోరం జరిగింది. కురబలకోట మండలం చేనేతనగర్‌లో చిన్నారి వర్షిత హత్యాచార సంఘటన మరువక ముందే కలికిరి మండలంలో పదేళ్ల చిన్నారిపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. Also Read: కలికిరి మండలం పత్తేగడ పంచాయతీలోని ఓ గ్రామానికి చెందిన బాలిక(10) పీలేరులోని గవర్నర్‌మెంట్ హాస్టల్‌లో ఉంటూ ఆరో తరగతి చదువుతోంది. రెండ్రోజుల క్రితం అనారోగ్యానికి గురికావడంతో ఇంటికి వచ్చింది. శనివారం రాత్రి గ్రామంలోని ఆలయం వద్ద ఆడుకుంటున్న చిన్నారితో అదే గ్రామానికి చెందిన వీరభద్రయ్య(25) అనే యువకుడు మాటలు కలిపాడు. తనతో వస్తే ఊరు మొత్తం చూపిస్తానని నమ్మించి బైక్‌పై తీసుకెళ్లాడు. Also Read: గ్రామ శివారులోని ఓ నిర్మానుష్య ప్రాంతానికి బాలికను తీసుకెళ్లి బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. తిరిగి గ్రామంలోకి తీసుకొచ్చి దించేసి ఆలయం వద్ద దించేసి వెళ్లిపోయాడు. బాలిక వెంటనే ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో వారు ఆదివారం కలికిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్ఐ రామాంజనేయులు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. Also Read:


By November 25, 2019 at 11:15AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/10-year-old-girlraped-in-chittoor-case-booked/articleshow/72218364.cms

No comments