చిచ్చురేపిన కులాంతర వివాహం.. యువకుడి ఇంటిని ధ్వంసం చేసిన అమ్మాయి బంధువులు

కులాంతర చేసుకున్న యువకుడి ఇంటిపై యువతి బంధువులు దాడికి పాల్పడిన ఘటన మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో జరిగింది. రామన్నగూడెంకు చెందిన ఎస్సీ కులానికి చెందిన యువకుడు, అదే గ్రామానికి చెందిన ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన యువతిని ప్రేమించాడు. వారి ప్రేమకు పెద్దలు అంగీకరించరన్న ఆందోళనతో ఈ నెల 5వ తేదీన యువతిని తీసుకుని వెళ్లిపోయిన ఓ ఆలయంలో రహస్యంగా వివాహం చేసుకున్నాడు. Also Read: గ్రామానికి వెళ్తే తమకు ప్రాణహాని ఉంటుందన్న ఆందోళనతో నర్సంపేటలో స్నేహితుల వద్ద ఉంటున్నారు. వివాహం గురించి మంగళవారం యువతి బంధువులకు తెలియడంతో రెచ్చిపోయారు. వెంటనే యువకుడి ఇంటికి రాగా తాళం వేసి ఉంది. దీంతో వారంతా తలుపులు పగులగొట్టుకుని లోనికి వెళ్లి వస్తువులన్నింటినీ ధ్వంసం చేశారు. పెరట్లోని కొబ్బరిచెట్లను నరికేశారు. Also Read: యువకుడి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కొత్తకోట ఎస్ తాహెర్‌బాబా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించి బాధితుల వాంగ్మూలం తీసుకున్నారు. దాడికి పాల్పడిన వారిపై కఠినచర్యలు తీసుకుంటామని చెప్పారు. పెళ్లి చేసుకున్న జంట గ్రామానికి వస్తే రక్షణ కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. Also Read:
By November 13, 2019 at 12:15PM
No comments