'మహా' రాజకీయంపై సుప్రీం సంచలన తీర్పు.. రేపే బలపరీక్ష

మహారాష్ట్ర పొలిటికల్ గేమ్‌పై హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.. బలపరీక్షకు ముహూర్తం ఖరారైపోయంది. బుధవారం సాయంత్రం 5 గంటలలోపు బలపరీక్ష నిర్వహించాలని ఆదేశించింది. వెంటనే ప్రొటెం స్పీకర్‌ను నియమించాలని.. బలపరీక్షను కూడా ప్రత్యక్ష ప్రసారం చేయాలని జస్టిస్ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం సూచించింది. బలపరీక్షకు సంబంధించిన ఓటింగ్ రహస్యంగా నిర్వహించాల్సిన అవసరం లేదని కోర్టు తెలిపింది. బలపరీక్షకు ముందే ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం జరగాలని సూచించింది. 288 అసెంబ్లీ సీట్లున్న మహారాష్ట్రలో బీజేపీ 105 స్థానాల్లో గెలిచింది. శివసేన 56 సీట్లు దక్కగా.. ఎన్సీపీ 54, కాంగ్రెస్‌కు 44 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కనీసం 145 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండాలి. బీజేపీకి 11 మంది ఇండిపెండెంట్ల మద్దతు ఉండగా... మరో 29 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం.
By November 26, 2019 at 10:55AM
No comments