Breaking News

`దొంగ` మెప్పిస్తాడన్న కింగ్‌.. వదినకు తమ్ముడిగా కార్తి


కోలీవుడ్‌ యాంగ్రీ హీరో కార్తీ కథానాయకుడిగా వయాకామ్‌ 18 స్టూడియోస్‌, ప్యారలల్‌ మైండ్స్‌ ప్రొడక్షన్‌ పతాకాలపై తెరకెక్కుతున్న ఎమోషనల్‌ యాక్షన్‌ డ్రామా దొంగ. దృశ్యం (తమిళ వర్షన్‌) ఫేం జీతు జోసెఫ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కార్తీ వదిన, సూర్య సతీమణి జ్యోతిక ఓ కీలక పాత్రలో నటించడం విశేషం. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్‌. ఈ సినిమా టీజర్‌ను టాలీవుడ్‌ కింగ్‌ నాగార్జున చేతుల మీదుగా విడుదల చేశారు. గతంలో నాగార్జున, కార్తీ కలిసి 'ఊపిరి' చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమా షూటింగ్‌ సమయంలో వారిద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. ఇప్పుడు కార్తీ లేటెస్ట్‌ మూవీ 'దొంగ' టీజర్‌ను రిలీజ్‌ చేసిన కింగ్‌ నాగార్జున 'మరో బ్లాక్‌బస్టర్‌ రాబోతోంది' అంటూ టీమ్‌కి ఆల్‌ ది బెస్ట్‌ తెలిపారు. తమిళ్‌లో తంబి పేరుతో రిలీజ్‌ అవుతున్న ఈ సినిమాటీజర్‌ను హీరో మోహన్‌లాల్‌, హీరో సూర్యలు విడుదల చేశారు. Also Read: ఈ సినిమాలో కార్తీ క్యారెక్టరైజేషన్‌ చాలా డిఫరెంట్‌గా ఉండబోతోందని టీజర్‌ చూస్తే అర్ధమవుతోంది. రకరకాల పేర్లతో దొంగతనాలు చేసే వ్యక్తిగా కార్తి పాత్రలను పరిచయం చేశారు. ఆడియన్స్‌ని థ్రిల్‌ చేసే యాక్షన్‌ సీక్వెన్సులు, అక్క, తమ్ముడు మధ్య కొన్ని ఎమోషనల్‌ సీన్స్‌, సెంటిమెంట్‌ సీన్స్‌తో టీజర్‌ను ఆసక్తికరంగా రూపొందించారు. గోవింద్‌ వసంత బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ మరింత హైప్‌ తీసుకువచ్చింది. Also Read: ఇటీవల విడుదలై బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని అందుకున్న 'ఖైదీ' తర్వాత యాంగ్రీ హీరో కార్తీ చేసిన 'దొంగ' పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను సూర్య రిలీజ్‌ చేయగా, ఇప్పుడు టీజర్‌ను కింగ్‌ నాగార్జున విడుదల చేసి బెస్ట్‌ విషెస్‌ తెలియజేశారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాను డిసెంబర్‌లో విడుదల చేసేందుకు చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.


By November 16, 2019 at 12:36PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/karthi-jyothika-starrer-donga-telugu-teaser/articleshow/72082374.cms

No comments