హైటెక్ వ్యభిచారం గుట్టురట్టు.. విమానాల్లో విటుల వద్దకే అమ్మాయిల సరఫరా

ఉత్తర్‌ప్రదేశ్ అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారిపోతోంది. రోజుకో చోట సెక్స్ రాకెట్ పట్టుబడటంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. తాజాగా కాన్పూర్‌లో గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతున్న హైటెక్ వ్యభిచారం గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ సందర్భంగా నలుగురు బాలికలు, ఓ విటుడిని అరెస్ట్ చేశారు. Also Read: కాన్పూర్‌లోని లాజ్‌పత్‌నగర్‌లోని ఒక ఫ్లాట్‌లో కొద్దిరోజులుగా సెక్స్ రాకెట్ కొనసాగుతోంది. దీనిపై స్థానికుల నుంచి ఎన్నో ఫిర్యాదులు రావడంతో పోలీసులు నిఘా పెట్టారు. ఆదివారం ఈ ముఠాకు చెందిన మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్ద అనేక రైలు, విమాన టిక్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఆమెను ప్రశ్నించగా సెక్స్ రాకెట్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు చెప్పింది. విటుల కోరిక మేరకు సెక్స్ వర్కర్లను ఇతర ప్రాంతాలకు రైలు, విమానాల్లో తీసుకెళ్తామని, ప్రయాణ ఛార్జీలు కూడా కస్టమర్లే భరిస్తారని తెలిపింది. Also Read: ఆమె నుంచి మరింత సమాచారం రాబట్టిన పోలీసులు ఆదివారం రాత్రి ఫ్లాట్‌లో రైడ్ నిర్వహించారు. ఈ సందర్భంగా నలుగురు బాలికలతో పాటు ఓ విటుడిని అరెస్ట్ చేశారు. బాలికలను ఘజియాబాద్, హర్యానాలోని కర్నాల్, ఢిల్లీలోని జాదవ్‌పూర్ నుంచి తీసుకొచ్చినట్లు పోలీసులు గుర్తించారు. పేదరికంలో మగ్గుతున్న బాలికలకు పెద్దమొత్తంలో డబ్బు ఆశచూపి సెక్స్ రాకెట్ నిర్వాహకులు వారిని వ్యభిచార కూపంలోకి దించుతున్నారని పోలీసులు పేర్కొన్నారు. నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read: Also Read:
By November 27, 2019 at 12:44PM
No comments