Breaking News

బన్నీ సినిమాలో టబు పాత్రేంటి..?


త్రివిక్రమ్ సినిమాల్లో సీనియర్ నటులకు కీలక పాత్రలు పడతాయి. నదియా కానీ, ఖుష్బూ కానీ ఇలా ఎవరిని తీసుకున్నా త్రివిక్రమ్ వాళ్ళకి బలమైన పాత్రలు రాస్తాడు. తాజాగా అల వైకుంఠపురములో సినిమా కోసం బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ టబుని తీసుకొచ్చాడు. అల్లు అర్జున్ - పూజా హెగ్డే జంటగా నివేత పేతురేజ్ సెకండ్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న అల వైకుంఠపురములో సినిమాకి స్పెషల్ ఎట్రాక్షన్ టబునే. ఎందుకంటే అత్తారింటికి దారేది సినిమాలో నదియా పవర్ ఫుల్ కేరెక్టర్ లో అదరగొట్టేసింది. ఇక ఖుష్బూ కూడా అజ్ఞాతవాసి సినిమాలో డీసెంట్‌గా అదరగొట్టేయడంతో.. టబు పాత్రపై అంచనాలు పెరిగిపోయాయి.

తాజాగా వదిలిన టబు లుక్ చూసాక.. టబు రాయల్ గెటప్‌లో అదిరిపోయే యంగ్ లుక్ లో కనబడుతుంది. ఆ లుక్ లో టబుని చూడగానే అల వైకుంఠపురములో టబు అల్లు అర్జున్ అక్కగా నటిస్తుందేమో... అందుకే అంత స్మార్ట్ గా యంగ్ లుక్ లో కనబడుతుంది అనే టాక్ వినబడుతోంది. ఇక టబు పాత్ర కూడా మధ్యతరగతి కుటుంబం నుండి గొప్పింటి కోడలిగా వెళ్లిన అమ్మాయిగా ఉండబోతుందని ప్రచారం జరుగుతుంది. మరి అందులో నిజమెంతుందో తెలియదు కానీ.. టబు పాత్రపై మాత్రం రకరకాల ఊహాగానాలు ఫిలింసర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. మరి త్రివిక్రమ్.. టబు ని ఎలా చూపించబోతున్నాడో అనేది సంక్రాంతికి తెలుస్తుంది. 



By November 06, 2019 at 06:05AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/48148/ala-vaikunthapurramloo-movie.html

No comments