రిస్క్ చేస్తున్న వెంకీ మామ.. అన్ సీజన్‌లో ఆడియన్స్ ముందుకు!

రియల్ లైఫ్ మామా అల్లుళ్లు , నాగ చైతన్యలు రీల్ లైఫ్‌లోనూ మామా అల్లుళ్లుగా నటించిన ఈ సినిమా వెంకీ మామా. దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను సురేష్ బాబు, టీజీ విశ్వ ప్రసాద్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వెంకీకి జోడిగా పాయల్ రాజ్‌పుత్, చైతూకి జోడిగా రాశీ ఖన్నాలు నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ సినిమాను డిసెంబర్ నెలాఖరున రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు చిత్రయూనిట్. అయితే అదే సమయంలో మరిన్ని సినిమాలు రిలీజ్ ఉండటంతో సోలో రిలీజ్‌కు సరైన డేట్ వెతికే పనిలో పడ్డారు. అయితే తాజాగా నిర్మాత సురేష్ బాబు వెంకీ మామ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తోంది. Also Read: ఈ సినిమాను వెంకటేష్ పుట్టిన రోజు కానకగా డిసెంబర్ 13న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే నవంబర్ నుంచి డిసెంబర్ 20 వరకు సినిమాల రిలీజ్‌కు అనువైన సమయం కాదు. విద్యార్థలకు ఎగ్జామ్స్ జరుగుతుంటాయి కాబట్టి థియేటర్లకు వచ్చే జనం తక్కువగా ఉంటారు. అందుకే ఆ సీజన్‌లో పెద్ద సినిమాలేవి రిలీజ్ కావు. క్రిస్టమస్ నుంచే భారీ చిత్రాల సందడి మొదలవుతుంది. Also Read: అయితే అన్ సీజన్ అయిన పరవాలేదని వెంకీ మామను డిసెంబర్ 13నే రిలీజ్ చేసేందుకు నిర్ణయించుకున్నారు. ఆ డేట్ వదిలేస్తే సోలో రిలీజ్‌కు దగ్గరలో డేట్ లేకపోవటంతో పాటు, వెంకీ ఫ్యాన్స్ కూడా బర్త్‌డే కానుకగా సినిమా రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తుండటంతో అదే డేట్‌ను పైనల్ చేశారు. Also Read: ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ప్రారంభించిన చిత్రయూనిట్ ఎట్టి పరిస్థితుల్లో డిసెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రావాలని ప్లాన్ చేస్తున్నారట. ఆ రోజున వస్తే సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే క్రిస్టమస్ సెలవులు కూడా కలిసొస్తాయని భావిస్తున్నారు చిత్రయూనిట్. అయితే అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు. Also Read:
By November 17, 2019 at 11:08AM
No comments