Breaking News

‘నన్ను గర్భవతిని చేశాడు.. పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతా’.. టవరెక్కి యువతి హల్‌చల్


ప్రేమిస్తున్నానంటూ మాయమాటలతో నమ్మించాడు. పెళ్లి చేసుకుంటానని శారీరకంగా లొంగదీసుకుని గర్భవతిని చేశాడు. ఇప్పుడు పెళ్లి చేసుకోనని మొహం చాటేశాడు. అతడితో పెళ్లి చేయకపోతే దూకి చచ్చిపోతా’ అంటూ జిల్లాలో ఓ యువతి హల్‌చల్ చేసింది. నెల్లూరు కబాడిపాలెంకు చెందిన సింధూర్‌కుమార్ అనే వ్యక్తికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. పాలిటెక్నిక్ కాలేజీలో ఔట్‌సోర్సింగ్‌లో అటెండర్‌గా పనిచేస్తున్న ఆయన్ని బుధవారం ఓ యువతి నిలదీసింది. తనను పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టింది. ఈ విషయం తెలుసుకున్న కుమార్ భార్య, బంధువులు కాలేజీకి వచ్చి యువతిపై దాడికి పాల్పడ్డారు. Also Read: దీంతో ఆమె బుధవారం సాయంత్రం ఆత్మకూరు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయకుండానే వెళ్లిపోయింది. గురువారం ఉదయం 8.30 గంటల సమయంలో వాటర్ ట్యాంక్ ఎక్కి హల్‌చల్ చేసింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తనను సింధూర్ కుమార్ ప్రేమ పేరుతో మోసగించడంతో గర్భం దాల్చానని, అతడితో పెళ్లి చేయకపోతే దూకి చచ్చిపోతానని బెదిరించింది. కిందికి వస్తే న్యాయం చేస్తామని ఆత్మకూరు సీఐ పాపారావు, ఎస్సైలు రోజారాణి, సంతోష్‌కుమార్‌రెడ్డి, తహసీల్దారు మధుసూదనరావు ఆమెకు భరోసా ఇచ్చినా ఒప్పుకోలేదు. Also Read: దీంతో మధ్యాహ్నం 1 గంటలకు అధికారులు సింధూర్‌కుమార్‌ను అక్కడికి తీసుకొచ్చి తగిన న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో కిందికి దిగింది. యువతిని వెంటనే ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. ప్రస్తుతం ఆమె మానసిన పరిస్థితి సరిగ్గా లేదని, కోలుకున్నాక వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తామని తెలిపారు. Also Read:


By November 15, 2019 at 09:52AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/nellore-young-woman-attempt-suicide-for-marriage-with-lover/articleshow/72065502.cms

No comments