Breaking News

రాశీఖన్నా తొలిసారిగా.. `వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌` కోసం!


అవసరాల శ్రీనివాస్‌ దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా తెరకెక్కిన ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన అందాల భామ . తొలి సినిమాలో కాస్త బొద్దుగా కనిపించినా తన అందం అభినయంతో అందరి దృష్టిని ఆకర్షించింది ఆ బ్యూటీ. అయితే తొలి సినిమా సూపర్‌ హిట్ అయిన మరో సక్సెస్‌ చూసేందుకు ఈ భామకు రెండుళ్లు పట్టింది. వరుసగా జోరు, జిల్‌, శివం, బెంగాల్ టైగర్‌ సినిమాలు ప్లాప్‌ అవ్వటంతో అమ్మడి కెరీర్‌ కష్టాల్లో పడ్డట్టే అనుకున్నారు అంతా కానీ సుప్రీం సినిమాతో మరో సక్సెస్‌ను అందుకొని టాలీవుడ్‌లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. అదే జోరులో యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌ సరసన జై లవ కుశ సినిమాలో నటించింది. అయితే ఈ సక్సెస్‌ అయినా తరువాత కూడా స్టార్‌ హీరోలెవరూ రాశీకి ఛాన్స్‌ ఇవ్వేలేదు. Also Read: ఇండస్ట్రీకి వచ్చిన ఐదేళ్లు గడుస్తున్నా ఇంకా మీడియం రేంజ్‌ హీరోల సినిమాలతోనే సరిపెట్టుకుంటుంది రాశీ. తనతో పాటు ఇండస్ట్రీకి పరిచయం అయిన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ టాప్‌ లీగ్‌లోకి రావటమే కాదు బాలీవుడ్‌లోనూ పాగా వేసేందుకు ప్రయత్నాలు చేస్తుంది. కానీ రాశీ మాత్రం ఇంకా టాలీవుడ్‌లోనే స్టార్‌ ఇమేజ్‌ కోసం పోరాడుతోంది. ఈ మధ్యే కోలీవుడ్‌లోనూ అడుగుపెట్టిన ఈ బ్యూటీ అక్కడ కూడా బిజీ అవుతుంది. ప్రస్తుతం ఈ భామ చేతినిండి సినిమాలతో యమా బిజీగా ఉంది. రెండు తమిళ సినిమాలతో పాటు మూడు తెలుగు సినిమాలో నటిస్తోంది ఈ బ్యూటీ. తెలుగులో వెంకటేష్‌, నాగచైతన్య హీరోలుగా తెరకెక్కుతున్న వెంకీ మామ, సాయి ధరమ్‌ తేజ్‌ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిరోజు పండగే సినిమాలతో పాటు హీరోగా తెరకెక్కుతున్న సినిమాల్లో నటిస్తోంది. Also Read: అయితే తాజాగా తన సోషల్ మీడియా పేజ్‌లో వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్‌ అప్‌డేట్‌ను పోస్ట్ చేసింది రాశీఖన్నా. ఇన్నేళ్ల కెరీర్‌లో ఏ తెలుగు సినిమాకు డబ్బింగ్‌ చెప్పని రాశీ, వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ సినిమా కోసం తన పాత్రకు డబ్బింగ్ చెపుతుంది. ఇటీవల డబ్బింగ్ కార్యక్రమాలు ప్రారంభించిన రాశీ తన ఫోటోను ట్వీట్ చేసింది. తొలిసారిగా తన గళం వినిపిస్తున్న ఈ బ్యూటీ ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.


By November 07, 2019 at 09:53AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/raashi-khanna-dubs-for-the-first-time-in-vijay-devarakonda-world-famous-lover/articleshow/71949020.cms

No comments