బంగ్లా యువతితో వ్యభిచారం.. దంపతులకు షాకిచ్చిన రాచకొండ పోలీసులు

అమ్మాయిలను ఎరగా వేసి వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్న బంగ్లాదేశ్‌కు చెందిన దంపతులకు రాచకొండ పోలీసులు షాకిచ్చారు. బంగ్లాదేశ్‌కు చెందిన మహమ్మద్ సోహెల్ హుస్సేన్(29), అతడి భార్య విస్టి హుస్సేన్(25)లు పదేళ్ల క్రితం భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించారు. బెంగళూరులో ఓటరు కార్డు సంపాదించి.. అక్కడి నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారు. Also Read: మియాపూర్‌లో ఇల్లు అద్దెకు తీసుకుని నకిలీ పత్రాలతో ఆధార్ కార్డు్ పొందారు. సులభంగా డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో బంగ్లాదేశ్ నుంచి ఓ యువతిని రప్పించి ఆమెతో వ్యభిచారం చేయించారు. సోషల్‌మీడియాలో యువతి అసభ్య ఫోటోలు పోస్ట్ చేసి విటులను ఆకర్షించేవారు. Also Read: ఆమెను నగరంలోని అనేక హోటళ్లు, లాడ్జిలకు తీసుకెళ్లి వ్యభిచారం చేయించారు. దీనిపై పక్కా సమాచారం రావడంతో పోలీసులు వారిపై నిఘా పెట్టారు. కొద్దిరోజుల క్రితం కుషాయిగూడలోని ఓ లాడ్జిలో యువతితో వ్యభిచారం చేయిస్తుండగా రైడ్ చేశారు. ఆమెను రక్షించి దంపతులను అరెస్ట్ చేసి చర్లపల్లి జైలుకు తరలించారు. అయితే వీరు బెయిల్‌పై బయటకు వస్తే మళ్లీ వ్యభిచార కార్యకలాపాలకు పాల్పడే అవకాశం ఉందని భావించిన రాచకొండ పోలీసులు వారిద్దరిపై పీడీ యాక్ట్ ప్రయోగించారు. దీనిపై కమిషనర్ మహేశ్ భగవత్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. Also Read:
By November 26, 2019 at 10:24AM
No comments