Breaking News

జర్నలిస్ట్ ఉద్యోగం మానలేదని భార్యను ఆఫీసులోనే కాల్చి చంపాడు


పాకిస్థాన్‌లోని నగరంలో దారుణ ఘటన జరిగింది. ఉర్దూ దినపత్రికలో జర్నలిస్టుగా పనిచేస్తున్న తన భార్య ఉద్యోగం మానడం లేదన్న కోపంతో భర్త ఆమెను తుపాకీతో కాల్చి చంపాడు. సెంట్రల్ లాహోర్ నగరంలోని ఖిలా గుజ్జర్ సింగ్ ప్రాంతానికి చెందిన ఉరూజ్‌ ఇక్బాల్‌ (27) అనే మహిళ ఉర్దూ న్యూస్ పేపర్‌లో క్రైమ్ రిపోర్టర్‌గా పనిచేస్తోంది. ఏడు నెలల క్రితం ఉర్జూ ఇక్బాల్ దిలావర్ అలీ అనే జర్నలిస్టును ప్రేమ వివాహం చేసుకుంది. Also Read: అయితే పెళ్లయిన తర్వాత ఉద్యోగం మానేయాలని భర్త చెబుతున్నా ఉరూజ్‌ వినడం లేదు. దీనిపై భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతుండటంతో కొద్దిరోజులుగా విడిగా ఉంటున్నారు. భర్త వేధిస్తున్నాడని ఉరూజ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ జరుగుతుండగానే దిలావర్ మంగళవారం భార్య పనిచేస్తున్న కార్యాలయానికి వచ్చి ఆమెను తలపై తుపాకీతో కాల్చి చంపాడు. సహోద్యోగులు ఉరూజ్‌ను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించిందని డాక్టర్లు నిర్ధారించారు. Also Read: ఘటన అనంతరం దిలావర్ అలీ అక్కడి నుంచి పరారయ్యాడు. మృతురాలి సోదరుడు యాసీర్ ఇక్బాల్ ఫిర్యాదు మేర లాహోర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తాము కాల్పుల జరిగిన ప్రదేశంలోని సీసీటీవీ ఫుటేజీని సేకరించి ఫోరెన్సిక్ పరిశీలనకు పంపించామని లాహోర్ పోలీసు అధికారి ముహమ్మద్ చెప్పారు. నిందితుడు దిలావర్ అలీ కోసం ప్రత్యేక టీమ్‌లు గాలిస్తున్నాయని తెలిపారు. అలీపై తాము ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలూ చేపట్టకపోవడంతో ఈ ఘాతుకం ఉరూజ్ సోదరులు చెబుతున్నాడు. భర్త తీరుతో విసిగిపోయిన తమ సోదరి ఉర్దూ పత్రిక కార్యాలయ భవనం పక్కనే ఓ గదిలో ఉంటోందని వెల్లడించాడు. Also Read:


By November 27, 2019 at 09:16AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/pakistan-journalist-murdered-by-husband-over-she-refuses-quitting-job/articleshow/72251650.cms

No comments