Breaking News

Bigg Boss 3 Telugu: మాల్దీవ్స్‌లో రచ్చ చేస్తున్న రాములమ్మ!


బిగ్‌బాస్‌ సీజన్‌ 3 తెలుగు టైటిల్‌కు అడుగు దూరంలో ఆగిపోయిన అందాల భామ హాలీడేస్‌ ఎంజాయ్‌ చేస్తోంది. 106 రోజుల పాటు ప్రపంచానికి దూరంగా బిగ్‌ బాస్‌ హౌస్‌లో గడిపిన ఈ భామ బయటకు వచ్చిన వెంటనే ఫ్రెండ్స్‌తో కలిసి హాలీడే ట్రిప్‌కు మాల్దీవ్స్‌కు చెక్కేసింది. అక్కడ ఎంజాయ్‌ చేస్తున్న వీడియోలను అభిమానుల కోసం సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తోంది ఈ బ్యూటీ. ఈ ట్రిప్‌లో శ్రీముఖితో పాటు యాంకర్‌ విష్ణు ప్రియ, ఆర్జే చైతూలు కూడా ఉన్నారు. తాజాగా మాల్దీవ్స్‌లో ఫ్రెండ్స్‌తో కలిసి సరదాగా డ్యాన్స్‌ చేస్తున్న వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌లో షేర్‌ చేసింది శ్రీముఖి. నాని హీరోగా తెరకెక్కిన గ్యాంగ్‌ లీడర్‌ సినిమాలోని టైటిల్ సాంగ్‌కు తనదైన స్టైల్‌లో స్టెప్స్‌ వేసి ఇరగదీసింది. టైటిల్‌ చేజారినందుకు వేదిక మీద ఒకింత బాదపడినా తరువాత తన గేమ్‌కు వస్తున్న ప్రశంసలను బాగానే ఎంజాయ్ చేస్తోంది శ్రీముఖి. Also Read: బిగ్ బాస్‌ హౌస్‌లో శ్రీముఖి ప్రయాణం అద్భుతంగా సాగిందనే చెప్పాలి. డే వన్‌ నుంచి శ్రీముఖి టైటిల్ కొట్టే చాన్స్‌ ఉందన్న పేరు తెచ్చుకుంది. అంతేకాదు టాస్క్‌లోనూ మేల్‌ కంటెస్టెంట్‌లకు గట్టిపోటి ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించింది. ఓటింగ్‌లోనూ టాప్‌లో నిలిచింది. బిగ్‌బాస్‌ నిర్వహకుల సోపోర్ట్‌ ఉందన్న ప్రచారం జరిగినా అన్నింటిని దాటి రన్నరప్‌గా నిలిచి సత్తా చాటింది. Also Read: ఈ జర్నీలో సోషల్ మీడియాలో శ్రీముఖిపై రకరకాల ప్రచారలు జరిగాయి. మీడియాను మేనేజ్‌ చేసేందుకు శ్రీముఖి టీంను సెట్‌ చేసుకుందన్న విమర్శలు గట్టిగా వినిపించాయి. అదే సమయంలో ఓ లేడీ బిగ్ బాస్‌ టైటిల్‌ కొట్టాలన్న ఆలోచనతో పలువురు సెలబ్రిటీలు శ్రీముఖికి మద్ధతు పలికారు. ఫైనల్ డే వరకు శ్రీముఖి టైటిల్‌ ఫేవరెట్ అని అనుకున్నారు అంతా. అయితే నెగెటివ్‌ ప్రచారం ఓటింగ్ మీద ప్రభావం చూపింది. అదే సమయంలో హౌస్‌లోకి తన తల్లి వచ్చిపోయిన తరువాత రాహుల్ గేమ్‌లో వచ్చిన చేంజ్‌ కూడా శ్రీముఖికి టైటిల్‌ను దూరం చేసింది. చివరి రెండు వారాలు అద్బుతమైన గేమ్‌తో ప్రేక్షకులను తనవైపు తిప్పుకోవటంతో సక్సెస్‌ అయ్యాడు రాహుల్‌. Also Read:


By November 09, 2019 at 01:13PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/bigg-boss-3-telugu-contestant-sreemukhi-enjoying-in-maldives/articleshow/71981817.cms

No comments