పెళ్లి చేసుకుని మోజు తీరాక పరార్.. వంచకుడి వలలో చిక్కిన 8 మంది మహిళలు
ఆడవాళ్లను ప్రేమ పేరుతో ముగ్గులోకి దించి పెళ్లి చేసుకుని మోజు తీరాక వదిలేసి పారిపోతున్న నిత్య పెళ్లికొడుకుని పోలీసులు అరెస్ట్ చేశారు. తంజావూరు జిల్లా ఓర్తాండు ప్రాంతానికి చెందిన సంతోష్ తిరుప్పూర్‌లో ఉన్న బనియన్ కంపెనీలో పని చేస్తున్నాడు. ఐదు నెలల క్రితం ఓ యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. ఆమెతో తిరుప్పూర్‌లోనే కాపురం పెట్టాడు. Also Read: ఈ నేపథ్యంలో నెల రోజుల నుంచి సంతోష్ కనిపించకుండా పోయాడు. దీంతో భర్త ఏమైపోయాడోనని ఆందోళన పడిన యువతి అతడి కోసం చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా ఫలితం కనిపించలేదు. దీంతో తన భర్త కనిపించడం లేదంటూ తిరుప్పూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు సంతోష్ కోసం గాలించారు. సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అతడు ఉన్న ప్రాంతాన్ని గుర్తించారు. దీంతో సంతోష్ కదలికలపై నిఘా పెట్టారు. Also Read: వారి విచారణలో అతడు మరో యువతిని పెళ్లి చేసుకుని మరోచోట కాపురం పెట్టినట్లు తెలిసి షాకయ్యారు. వెంటనే సంతోష్‌ను అరెస్ట్ చేసి విచారించగా ఇదే తరహాలో అతడు మొత్తం 8మందిని పెళ్లి చేసుకుని మోసం చేసినట్లు వెల్లడైంది. అమ్మాయిలకు ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి వారిని పెళ్లి చేసుకుని లైంగికంగా అనుభవించిన తర్వాత మొహం చాటేయడం అతడికి వెన్నతో పెట్టిన విద్య అని పోలీసులు చెబుతున్నారు. సంతోష్ చేతిలో మోసపోయిన బాధిత మహిళలను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. Also Read:
By November 24, 2019 at 09:03AM
No comments