Breaking News

సనత్‌నగర్‌లో 80ఏళ్ల వృద్ధురాలి దారుణహత్య


హైదరాబాద్‌లో దారుణహత్య జరిగింది. పోలీస్‌స్టేషన్ పరిధిలోని శివాజీనగర్‌లో సుందరమ్మ అనే 80 ఏళ్ల వృద్ధురాలిని దుండగులు దారుణంగా చంపేశారు. రోకలిబండతో తలపై కొట్టి ప్రాణం తీశారు. Also Read: శివాజీనగర్‌లో నివాసముండే సుందరమ్మకు ముగ్గురు కొడుకులు. వివాహాలు కావడంతో బోరబండలో వేర్వేరు ప్రాంతాల్లో నివాసముంటున్నారు. మంగళవారం సాయంత్రం సుందరమ్మ ఇంటికి వచ్చిన ఆమె కుటుంబసభ్యులు ఇల్లంతా చిందరవందరగా పడి ఉండటంతో షాకయ్యారు. లోనికి వెళ్లి చూడగా ఆమె మంచంపై విగతజీవిగా పడి ఉంది. దీంతో వారు వెంటనే సనత్‌నగర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. Also Read: క్లూస్ టీమ్, డాగ్ స్వ్కాడ్‌తో అక్కడికి చేరుకున్న పోలీసులు పలు ఆధారాలు సేకరించారు. ఇది దుండగుల చర్యేనా? లేక కుటుంబసభ్యులు, బంధువులెవరైనా ఆమె చంపారా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. Also Read:


By November 06, 2019 at 12:28PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/woman-80-found-brutally-murder-in-hyderabad/articleshow/71935055.cms

No comments