Breaking News

గచ్చిబౌలిలో పొదల్లో 16ఏళ్ల బాలిక శవం.. హత్యాచారంగా అనుమానం?


హైదరాబాద్‌లోని ప్రాంతంలో నాగేశ్వరి(16) అనే మైనర్ బాలిక అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించింది. మంగళవారం రాత్రి నుంచి కనిపించకుండా పోయిన బాలిక బుధవారం ఉదయం ఓ అపార్ట్‌మెంట్ పక్కనున్న పొదల్లో విగతజీవిగా పడివుంది. దీంతో స్థానికులు గచ్చిబౌలి పోలీసులకు సమాచారమిచ్చారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలిక మృతికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. Also Read: మహబూబ్ బాగర్ జిల్లా వనపర్తికి చెందిన మొగులయ్య, పద్మ చాలాకాలం క్రితం హైదరాబాద్‌కు వలస వచ్చి గచ్చిబౌలి మసీదుబండ ప్రాంతంలో నివాసముంటున్నారు. వీరి కుమార్తె నాగేశ్వరి(16) మంగళవారం సాయంత్రం నుంచి కనిపించుకుండా పోయింది. దీంతో ఆందోళన చెందిన దంపతులు కూతురి కోసం చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించినా ఫలితం లేకపోయింది. దీంతో రాత్రివేళ వారు గచ్చిబౌలి పోలీసులకు పిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు నాగేశ్వరి కోసం గాలింపు చేపట్టారు. Also Read: ఈ నేపథ్యంలోనే బుధవారం ఉదయం అపార్ట్‌మెంట్ పక్కనున్న పొదల్లో బాలిక మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు చెప్పారు. పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి నాగేశ్వరి అని నిర్ధారించారు. వెంటనే ఆమె తల్లిదండ్రులకు ఫోన్లో సమాచారం ఇచ్చారు. అయితే నాగేశ్వరి ఇక్కడ ఎందుకు చనిపోయి ఉందని పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆమెను ఎవరైనా ఎత్తుకెళ్లి అత్యాచారం చేసి చంపేసి ఇక్కడ పడేశారా? లేక అపార్ట్‌మెంట్ పైనుంచి ప్రమాదవశాత్తూ పడిపోయిందా?, లేక ఆత్మహత్య చేసుకుందా? అన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. Also Read:


By November 27, 2019 at 10:59AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/16-yr-old-girl-found-dead-in-gachibowli-hyderabad/articleshow/72252882.cms

No comments