Breaking News

ఘోర రోడ్డు ప్రమాదం: బస్సును ఢీకొట్టిన లారీ.. 14 మంది మృతి


రాజస్థాన్‌లో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ బస్సు, లారీ ఢీకొన్న ఘటనలో 14 మంది మృతిచెందగా, మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. బికనేర్‌ జిల్లా శ్రీదంగర్‌గఢ్‌ సమీపంలోని 11వ నెంబర్‌ జాతీయరహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం గురించి తెలిసిన స్థానికులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. స్థానికుల సమాచారంతో హుటాహుటిన అక్కడకు చేరుకున్న పోలీసులు క్షతగాత్రుల్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డవారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనకు దారితీసిన కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలంలోనే 10 మంది ప్రాణాలు కోల్పోగా, హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ నలుగురు మృతిచెందారు. బస్సులో చిక్కుకున్నవారిని అతికష్టంతో బయటకు తీశారు. లారీ, బస్సు ఒకదానికొకటి ఎదురెదురుగా వస్తుండగా ప్రమాదం జరిగింది. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు గుర్తించారు. లారీని బలంగా ఢీకొట్టడంతో బస్సు ముందు భాగం నుజ్జనుజ్జయ్యింది. దీంతో బస్సులోని ప్రయాణికులు తీవ్రంగా గాయపడి, అందులో చిక్కుకున్నారు. క్రేన్ సాయంతో బస్సును, లారీని వేరుచేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.


By November 18, 2019 at 10:16AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/collision-between-truck-and-bus-more-than-14-killed-and-several-injured-near-bikaner-in-rajasthan/articleshow/72103331.cms

No comments