Breaking News

స్లీపర్ బస్సులో 11ఏళ్ల బాలికపై బంధువు రేప్


రాజస్థాన్‌లో ఘోర ఘటన వెలుగుచూసింది. 11ఏళ్ల బాలికపై బంధువే బస్సులో అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మనోహపురా కచ్చి ప్రాంతానికి చెందిన మహిళ(40) భర్త చనిపోవడంతో కూలి పనులు చేసుకుంటూ జీవిస్తోంది. తన కుమార్తె(11) తౌ తాయ్ ప్రాంతంలో హాస్టల్‌లో ఉంచి చదివిస్తోంది. ఈ నెల 15వ తేదీన బాలిక ఇంటికి వచ్చేందుకు సిద్ధంగా కాగా.. ఆమె తల్లి తన బంధువుకు ఫోన్ చేసి ఆమెకు తోడుగా ఉండాలని కోరింది. దీంతో అతడు బాలికతో పాటు తనకూ స్లీపర్ బస్సులో టికెట్స్ బుక్ చేశాడు. Also Read: ఆ మరుసటి రోజు బాలికను ఇంటి వద్ద తల్లికి అప్పగించి ఆ వ్యక్తి వెళ్లిపోయాడు. అయితే బాలిక ఏదోచూసి భయపడినట్లు వణికిపోవడాన్ని గమనించిన తల్లి ఏం జరిగిందని ఆరా తీయగా.. రాత్రి అంకుల్ తనపై చేసినట్లు చెప్పింది. దీంతో షాకైన తల్లి వెంటనే జవహర్ సర్కిల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాలికను వైద్య పరీక్షలకు పంపించిన పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు. Also Read: బస్సులో తనకు దాహం వేసిన సమయంలో అంకుల్ నీళ్లు ఇచ్చాడని, తర్వాత తాను మత్తులోకి జారుకున్నానని బాలిక తెలిపింది. ఉదయం నిద్రలేచే సరికి ఒంటిపై దుస్తులు లేవని, జననాంగాల వద్ద రక్తం కారుతోందని తెలిపింది. దీంతో ఏడవగా.. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని అతడు బెదిరించాడని తెలిపింది. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. Also Read:


By November 18, 2019 at 11:36AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/11-year-old-innocent-girl-raped-by-uncle-in-sleeper-bus-accused-escape/articleshow/72104254.cms

No comments