Breaking News

YS Jagan: జగన్ జాగ్రత్త, సొంత వాళ్లే తిరగబడతారు.. ఉండవల్లి హెచ్చరికలు


వంద రోజులపాటు రాజకీయాలు మాట్లాడొద్దని నిర్ణయించుకున్నానన్న .. అన్నట్టుగానే ఇన్ని రోజులపాటు సైలెంట్ అయ్యారు. ఇప్పుడు వస్తూ వస్తూనే ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు హెచ్చరికలు పంపారు. 151 సీట్లొచ్చాయని.. అధికారం శాశ్వతం అని భావించొద్దని ఆయన జగన్‌ను హెచ్చరించారు. నవరత్నాల అమలులో ఏ మాత్రం తేడా వచ్చినా.. సొంతవారే తిరగబడతారు జాగ్రత్త అని హితవు పలికారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌లో ఎవరైనా అసమ్మతి స్వరం వినిపిస్తే.. ఢిల్లీ బుజ్జగించేది. కానీ వైఎస్ఆర్సీపీ ప్రాంతీయ పార్టీ. కాబట్టి అన్ని వ్యవహారాలను జగన్ చూసుకోవాల్సి ఉంటుందన్నారు. ఏపీ చరిత్రలో అత్యధిక మెజార్టీతో ఎవరు అధికారంలోకి వచ్చినా తిరుగుబాట్లు తప్పలేదని ఉండవల్లి గుర్తు చేశారు. 1972లో పీవీ నర్సింహారావుకు 210 సీట్లు వచ్చాయని, కానీ ఆయన్ను కేవలం 9 నెలల్లో దింపేశారని ఉండవల్లి తెలిపారు. 1994లో టీడీపీకి 213 సీట్లొచ్చాయి.. కానీ 9 నెలల్లోనే ఎన్టీఆర్‌ను దింపేశారని మాజీ ఎంపీ గుర్తు చేశారు. రాజమండ్రిలో మంగళవారం మీడియాతో మాట్లాడిన ఉండవల్లి.. రాష్ట్రంలో ఇంకా పాలన మొదలు కాలేదని అభిప్రాయపడ్డారు. ఇసుక విధానం సీఎంకు మైనస్‌గా మారిందన్నారు. విద్యుత్ కోతలతో ప్రభుత్వం పట్ల ప్రజలు ఒకింత అసంతృప్తితో ఉన్నారన్నారు. ప్రజలతో పాటుగా సొంత పార్టీ ఎమ్మెల్యేల్లో సైతం సీఎం మీద మంచి అభిప్రాయం ఉండాలి. వారికి ప్రాధాన్యత ఇస్తున్నారనే భావన కలిగించాలని జగన్‌కు ఉండవల్లి సూచించారు. సీఎంగా, పార్టీని నడిపే వ్యక్తిగా.. ప్రతి అంశంలోనూ జగన్ ఉన్నారని.. కాబట్టి జాగ్రత్తగా ఉండాలన్నారు. Read Also: జగన్ అవినీతి రహిత పాలన అందిస్తామని చెబుతుండటంపై కూడా ఉండవల్లి స్పందించారు. పై స్థాయిలో అవినీతి కనిపించడం లేదు. కింది స్థాయిలో అవినీతి లేకుండా పని జరగడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. అఖండ మెజార్టీతో విజయం సాధించిన నేత.. ప్రజలతో, తన ఎమ్మెల్యేలతో ఎలా మసులుకోవాలో ఉండవల్లి చెప్పిన తీరు బాగుంది. కానీ జాతీయ పార్టీలతో పోలిస్తే ప్రాంతీయ పార్టీలు భిన్నమైనవి. ప్రాంతీయ పార్టీల్లో సంక్షోభం రావాలంటే.. ఊహకు అందని పరిణామాలు జరగాల్సి ఉంటుంది.


By October 02, 2019 at 11:02AM


Read More https://telugu.samayam.com/andhra-pradesh/news/ex-mp-undvalli-arun-kumar-warns-ys-jagan-suggests-how-to-behave-with-mlas/articleshow/71403908.cms

No comments