Breaking News

Vuyyuru: అక్రమ సంబంధం అడ్డుకుంటున్నాడని ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి


ఓ వ్యక్తి ప్రాణం మీదికి వచ్చింది. తన సంబంధానికి అడ్డు పడుతున్నాడన్న కోపంతో ఓ వ్యక్తి ప్రియురాలి భర్తపై హత్యాయత్నం చేశాడు. కృష్ణా జిల్లా మండలం కాటూరు గ్రామానికి చెందిన యార్లగడ్డ శ్రీనివాసరావు అనే వ్యక్తి ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గతంలో అతడు ఉయ్యూరులో ఉన్న సమయంలో అతడి ఇంటి పక్కనే నివసించే పళ్లెం గిరిబాబు అతడి భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. శ్రీనివాసరావు డ్యూటీకి వెళ్లిన సమయంలో అతడి భార్య, గిరిబాబు రాసలీలలు కొనసాగించేవారు. Also Read: ఈ విషయం తెలుసుకున్న శ్రీనివాసరావు ఈ నెల మొదటి వారంలో భార్యను తీసుకుని కాటూరుకు మకాం మార్చాడు. ప్రియురాలిని దూరం చేయడంతో శ్రీనివాసరావుపై గిరిబాబు కక్ష పెంచుకున్నాడు. అతడిని ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలనుకుని ఆదివారం కాటూరుకు వెళ్లాడు. Also Read: శ్రీనివాసరావు కనిపించగానే కత్తితో విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డాడు. బాధితుడి కేకలు విన్న స్థానికులు అక్కడికి చేరుకోవడంతో నిందితుడు పారిపోయాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఉయ్యూరు రూరల్ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని శ్రీనివాసరావును ఆస్పత్రికి తరలించారు. Also Read:


By October 21, 2019 at 10:15AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/man-attacked-by-his-wifes-lover-due-to-illegal-affair-in-vuyyuru/articleshow/71681892.cms

No comments