Upasana On Sye Raa: ‘సైరా’ రెస్పాన్స్: బెజవాడ బీట్.. ఉపాసన ట్వీట్

‘స్టార్.. స్టార్ మెగాస్టార్.. హో సైరా’ నినాదాలతో రెండు తెలుగు రాష్ట్రాలు హోరెత్తుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి నటించిన చారిత్రాత్మక మూవీ భారీ అంచనాల నడుమ నేడు (అక్టోబర్ 2) విడుదల కావడంతో మెగా ఫ్యాన్స్ సంబరాల్లో ముగిని తేలుతున్నారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ మొదలు.. అమలాపురం వరకూ ఎక్కడ చూసినా థియేటర్స్ అన్నీ ‘సైరా’ నామస్మరణతో మారు మోగుతున్నారు. దసరా పండుగతో పాటు గాంధీ జయంతి సెలవు కావడంతో మూవీ లవర్స్ అందరూ థియేటర్స్‌కి క్యూ కడుతున్నారు. ఇక మెగా ఫ్యాన్స్ అయితే అర్ధరాత్రి నుండే థియేటర్స్ వద్ద హంగామా చేస్తున్నారు. థియేటర్స్‌ను అలంకరించి భారీ కటౌట్స్‌తో ‘సైరా’కి స్వాగతం పలుకుతున్నారు. Read Also: ఇక మెగా ఫ్యాన్స్‌లో మరింత ఉత్సాహాన్నిస్తూ అదిరిపోయే ట్వీట్ వేశారు మెగా కోడలు ఉపాసన. ఒక వైపు మామ చిరంజీవి హీరో.. మరోవైపు భర్త రామ్ చరణ్ నిర్మాత.. ఎన్నాళ్లగానో ఎదురు చూసిన కలల ప్రాజెక్ట్‌ను రామ్ చరణ్ డీల్ చేయడంతో పాటు.. అభిమానుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండటంతో ఆనందానికి అవధులు లేవు. Read Also: ఈ సందర్భంగా విజయవాడలో మెగా ఫ్యాన్స్ చేస్తున్న హంగామా వీడియోను షేర్ చేశారు ఉపాసన. తీన్మార్ దరువులు, ఫ్యాన్స్ డాన్స్‌లు, బాణాసంచా కాల్పులతో పండగ వాతావరణాన్ని తలపిస్తున్న మెగా అభిమానుల సందడులను వరుసగా షేర్ చేస్తున్నారు. భీమవరం, హైదరాబాద్‌లతో పాటు విదేశాల్లో మెగా అభిమానుల సందడి షేర్ చేశారు ఉపాసన.
By October 02, 2019 at 11:32AM
No comments