Breaking News

RTGS సోషల్ మీడియా ప్రమోషన్ కోసం రూ.10 కోట్లు.. చిక్కుల్లో చంద్రబాబు!


సర్కారు హయాంలో 2017 నవంబర్ 24న ఆర్టీజీఎస్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. రియల్ టైం గవర్నెన్స్ సంక్షిప్త రూపమే . దీని కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ సెక్రటేరియట్‌లో ఉంది. ఈ వ్యవస్థను ఉపయోగించుకొని విపత్తులు తలెత్తినప్పుడు, ప్రమాదాలు జరిగిన సమయంలో ప్రభుత్వం వేగంగా స్పందించగలుగుతోంది. నిఘా వ్యవస్థకు కూడా ఇది ఉపయోగడుతోంది. ఈ వ్యవస్థ ఏర్పాటైన ఏడాదిలోనే పౌరసరఫరాల శాఖకు రూ.1600 కోట్లు ఆదా అయ్యాయని సర్కారు ప్రకటించింది. కాగా ఆర్టీజీఎస్ నిర్వహణ కోసం తొలి ఏడాది చంద్రబాబు సర్కారు రూ. 50 కోట్లు కేటాయించింది. ఆర్టీజీఎస్ సోషల్ మీడియా ప్రమోషన్ కోసం ఏకంగా రూ. 9.81 కోట్లు ఖర్చు చేశారనే విషయాన్ని వైఎస్ఆర్సీపీ శ్రేణులు బయటపెట్టాయి. కేవలం సోషల్ మీడియా ప్రమోషన్ కోసం ఈ స్థాయిలో ఖర్చు పెట్టారంటే అది ఎవరికి లబ్ధి చేకూర్చడానికి అని ప్రశ్నిస్తున్నాయి. ఆర్టీజీఎస్ సీఈవో, ఆర్టీజీసీ సొసైటీ వినతి మేరకు వీఎంఎస్ ఇండస్ట్రీస్, హుబిలో సాఫ్ట్‌టెక్ ప్రయివేట్ లిమిటెడ్ కంపెనీలను సోషల్ మీడియా మేనేజ్‌మెంట్ ఏజెన్సీలుగా నియమించడం కోసం రూ.9.80,98,824లు రిలీజ్ చేసినట్టు నాటి ప్రభుత్వం పేర్కొంది. అక్టోబర్ 24, 2017న దీనికి సంబంధించి జీవో విడుదల చేసింది. Read Also: చంద్రబాబుకు అనుకూలంగా ఉన్నవారికి లబ్ధి చేకూర్చడం కోసమే సర్కారు కేవలం ఆర్టీజీఎస్ సోషల్ మీడియా ప్రమోషన్ కోసం దాదాపు రూ.10 కోట్లు మంజూరు చేసిందని.. ఈ విషయమై విచారణ జరపాలని వైఎస్ఆర్సీపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి.


By October 04, 2019 at 10:32AM


Read More https://telugu.samayam.com/andhra-pradesh/news/tdp-govt-released-rs-9-81-crore-for-rtgs-social-media-promotion-in-2017-ysrcp-demands-probe/articleshow/71434595.cms

No comments