Breaking News

Pune: సినిమా ఛాన్సులు ఇప్పిస్తానని నమ్మించి యువతిపై రేప్


సినిమాల్లో అవకాశాల పేరుతో ఓ వ్యక్తి యువతిని ప్రలోభపెట్టి లైంగిక దాడికి పాల్పడిన ఘటన మహారాష్ట్రలోని పుణెలో వెలుగుచూసింది. పుణెకు చెందిన ఓ యువతికి సినిమాల్లో నటించాలని కోరిక. దీనికోసం ఎన్నో రోజులుగా ఏజెన్సీల చుట్టూ అవకాశాల కోసం తిరుగుతోంది. ఈ క్రమంలోనే ఆమెకు వికాస్ అనే అసిస్టెంట్ డైరెక్టర్ పరిచయమయ్యాడు. తనకు ఎంతో మంది సినీ ప్రముఖులతో పరిచయముందని, అవకాశాలు ఇప్పిస్తానని నమ్మబలికారు. Also Read: కొద్దిరోజుల క్రితం పుణెలోని ఓ గెస్ట్‌హౌస్‌కు యువతిని తీసుకెళ్లిన వికాస్ ఆమెను లొంగదీసుకున్నాడు. తన కోరిక తీరిస్తే అవకాశాలు ఇప్పిస్తానని నమ్మబలికి అత్యాచారం చేశాడు. అనంతరం ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే ఒక్క ఛాన్స్ కూడా రాకుండా చేస్తానని బెదిరించాడు. కొద్దిరోజుల తర్వాత మళ్లీ ఆమెను గెస్ట్‌హౌస్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. Also Read: రోజులు గడుస్తున్నా వికాస్ ఒక్క ఛాన్స్ కూడా ఇప్పించకపోవడంతో బాధితురాలికి అనుమానం వచ్చి గట్టిగా నిలదీసింది. అంతే అప్పటి నుంచి ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి తప్పించుకుని తిరగడం మొదలుపెట్టాడు. దీంతో మంగళవారం బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. వికాస్‌పై చీటింగ్, అత్యాచారం సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు. Also Read: గమనిక: అత్యాచారాలు, లైంగిక వేధింపుల కేసుల్లో బాధితులకు సంబంధించి గోప్యత పాటించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వారి పేర్లు, వివరాలు వెల్లడించడంలేదు.


By October 12, 2019 at 07:59AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/man-booked-for-raping-woman-on-pretext-marriage-in-pune/articleshow/71549413.cms

No comments