Breaking News

ఒంటరిగా ఉందని కన్నేశాడు.. ఇంట్లోకి దూరి అత్యాచారం చేశాడు


జిల్లాలో ఘోర ఘటన వెలుగులోకి వచ్చింది. పదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. పెనుకొండలోని ఓ గ్రామానికి చెందిన బాలిక పదో తరగతి చదువుతోంది. ఈ నెల 23న ఆమె తల్లిదండ్రులు, సోదరుడు ఏదో పని నిమిత్తం ఇతర ప్రాంతానికి వెళ్లారు. దీంతో బాలిక ఇంట్లో ఒంటరిగా ఉంది. అదేరోజు రాత్రి ఈ విషయాన్ని గమనించిన నరేశ్ అనే యువకుడు ఇంట్లోకి దూరి బాలికను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి కేకలు విన్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకోవడంతో నిందితుడు పరారయ్యాడు. దీంతో బాధితురాలి కుటుంబం మరుసటి రోజు నరేశ్ ఇంటికి వెళ్లి అతడి తల్లిదండ్రులకు విషయం చెప్పి హెచ్చరించారు. ఈ విషయంలో రాజీ కుదిర్చేందుకు పెద్దలు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో బాధితురాలు ఆదివారం అమ్మవారిపల్లిలోని కియా పరిశ్రమ ఏరియా పోలీస్‌ స్టేషన్‌‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నిందితుడు నరేశ్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నరేశ్ పరారీలో ఉండటంతో అతడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


By October 29, 2019 at 10:00AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/class-10th-student-raped-by-young-man-in-anantapuram-district/articleshow/71800148.cms

No comments