విశాల్ పెళ్లి ఆమెతోనే.. త్వరలో డేట్ ఎనౌన్స్‌మెంట్!

కోలీవుడ్ హీరో విశాల్ పెళ్లిపై సస్పెన్స్‌కు త్వరలోనే తెరపడునుంది. ఈ ఏడాది మార్చిలో అనీషా అనే అమ్మాయితో నిశ్చితార్థం జరిగింది. హైదరాబాద్‌లో ఈ వేడుకను ఘనంగా నిర్వహించారు. అయితే నడిఘర్ సంఘం భవనం పూర్తయిన తరువాత ఆ భవనంలోనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న విశాల్ పెళ్లి డేట్‌ను నిశ్చితార్థం రోజు ప్రకటించలేదు. అయితే ఇటీవల విశాల్, అనీషలు నిశ్చితార్థం క్యా్న్సిల్ చేసుకున్నట్టుగా వార్తలు వినిపించాయి. అనీషా తన సోషల్ మీడియా పేజ్‌ల నుంచి ఎంగేజ్‌మెంట్ ఫోటోలు తీసి వేయటంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరినట్టైంది. మీడియా అభిమానులు అంతా విశాల్ పెళ్లి ఆగిపోయిందా అన్న అనుమానాలు వ్యక్తం చేసినా విశాల్ మాత్రం ఎలాంటి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయలేదు. Also Read: తాజాగా విశాల్, అనీషాల పెళ్లిపై విశాల్ తండ్రి స్పందించారు. చెన్నైలో జరిగిన ధమయంతి చిత్ర వేడుకలో పాల్గొన్న విశాల్ తండ్రి, నిర్మాత జీకే రెడ్డి త్వరలోనే విశాల్ పెళ్లి డేట్ నిర్ణయించి ప్రకటిస్తామని తెలిపారు. విశాల్, అనీషాలు నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకున్నట్టుగా వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. ఇటీవల నడిగర్ సంఘం ఎన్నికల ఫలితాలు ప్రకటించవద్దని కోర్టు స్టే ఇవ్వటంతో అన్న పనులు ఆగిపోయాయని, ఫలితాలు వచ్చిన వెంటనే నడిగర్ సంఘం భవనం నిర్మాణ పూర్తవుతుందని వెల్లడించారు. ముందుగా చెప్పినట్టుగా ఆ భవనంలోనే విశాల్ పెళ్లి జరుగుతుందని మరోసారి క్లారిటీ ఇచ్చారు. Also Read: ఇక సినిమాల విషయానికి వస్తే ఇటీవల అయోగ్య సినిమాతో ఆకట్టుకున్న విశాల్ ప్రస్తుతం సుందర్ సీ దర్శకత్వంలో యాక్షన్ సినిమాలో నటిస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సినిమాను నవంబర్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
By October 12, 2019 at 03:59PM
No comments