Breaking News

హైదరాబాద్‌లో వ్యభిచారం గుట్టురట్టు.. విటుడు సహా ముగ్గురి అరెస్ట్


హైదరాబాద్‌లోని అనేక ప్రాంతాల్లో వ్యభిచారం గుట్టుచప్పుడు కాకుండా సాగిపోతోంది. పోలీసులు ఎన్నిచోట్ల తనిఖీలు చేసి అరెస్ట్‌లు చేసినా ఈ దందా కొనసాగుతూనే ఉంది. తాజాగా ఎల్బీనగర్‌ డివిజన్‌లో మీర్‌పేటలో వ్యభిచారం దందాను పోలీసులు చేధించారు. Also Read: మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని శ్రీరమణ కాలనీకి చెందిన ప్రణయ నందిని(28) అనే మహిళ కొన్నాళ్లుగా తనింట్లోనే గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తోంది. బద్దం నిరంజన్ అనే వ్యక్తి సాయంతో ఇతర ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి వ్యాపారం చేస్తోంది. నందిని ఇంటికి తరుచూ అపరిచిత వ్యక్తులు రావడం, లోపలికెళ్లి గంటల తరబడి ఉండటంతో స్థానికులకు అనుమానం వచ్చింది. Also Read: దీంతో వారు మీర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొద్దిరోజుల పాటు నందినిపై నిఘా పెట్టిన పోలీసులు ఆమె అమ్మాయిలతో వ్యాపారం చేస్తోందని నిర్ధారించుకుని గురువారం ఆ ఇంటిపై దాడి చేశారు. ఈ సందర్భంగా నందిని, నిరంజన్‌తో పాటు విటుడు శ్రీకాంత్‌రెడ్డిని అరెస్ట్ చేశారు. రూ.3వేల నగదు, ఐదు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీరి బారి నుంచి ఓ యువతిని రక్షించి రెస్క్యూ హోమ్‌కు తరలించారు. నందిని కొన్నాళ్ల నుంచి వ్యభిచారాన్నే వృత్తిగా చేసుకుందని పోలీసులు తెలిపారు. Also Read:


By October 18, 2019 at 12:46PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/hyderabad-police-busted-sex-racket-in-meerpet-3-arrested/articleshow/71645105.cms

No comments