Breaking News

కవల సోదరులు కిరాతకం.. బాలికను ‌గ్యాంగ్ రేప్ చేసి చంపేశారు


తమిళనాడులో అత్యంత కిరాతక ఘటన చోటుచేసుకుంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్(ప్లస్ వన్) చదువుతున్న బాలికపై కవల సోదరులు అత్యాచారం చేసి దారుణంగా హత్య చేశారు. మంగళవారం జరిగిన ఈ ఘటనలో ఇద్దరు నిందితులను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. Also Read: మదురై జిల్లాలోని ఉసిలంపట్టి పట్టణంలో నివసించే ఓ బాలిక ప్లస్‌ వన్ చదువుతోంది. మంగళవారం ఆమె సమీపంలోని కాలువ వద్దకు స్నానం చేసేందుకు వెళ్లింది. ఈ విషయాన్ని గమనించిన కవల సోదరులు మాధవన్, మధు ఆమెను బెదిరించి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ ఇద్దరూ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం ఎవరికైనా చెబుతుందేమోనన్న ఆందోళనతో గొంతు నులిమి, తలపై బండరాయితో కొట్టి చంపేశారు. Also Read: స్నానం కోసం వెళ్లిన బాలిక ఎంతసేపటికీ రాకపోయేసరికి ఆమె తల్లిదండ్రులు చుట్టుపక్కల గాలించారు. ఓ ప్రాంతంలో బాలిక నగ్నంగా రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సేడపట్టి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉసిలంపట్టి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దర్యాప్తులో భాగంగా ఓనాపట్టికి చెందిన అమ్మవాసి కుమారుడు మాధవన్‌ (24) అదుపులోకి తీసుకుని విచారించగా తన సోదరుడు మధుతో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అంగీకరించాడు. విద్యార్థిని ఒంటరిగా కనిపించడంతో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డామని, ఈ విషయాన్ని ఎవరికైనా చెబుతుందన్న ఆందోళనతో చంపేశామని చెప్పాడు. దీంతో పోలీసులు ఇద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. Also Read:


By October 17, 2019 at 10:04AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/rape-murder-of-teen-tamilnadu-police-arrests-teins/articleshow/71625505.cms

No comments