Breaking News

`నేను కొన్ని చెత్త సినిమాలు చేశా`


అష్టా చమ్మా సినిమాతో కమెడియన్‌గా టాలీవుడ్‌లోకి ఎంటర్‌ అయిన అవసరాల శ్రీనివాస్‌ తరువాత దర్శకుడిగానూ తనదైన స్టైల్‌లో విజయాలు సాధించాడు. అవసరాల దర్శకత్వంలో తెరకెక్కిన ఊహలు గుసగుసలాడే, జోఅచ్యుతానంద సినిమాలు మంచి విజయాలు సాధించాయి. దర్శకుడిగా మారిన తరువాత నటుడిగా సెలక్టివ్‌గా సినిమాలు చేస్తున్నాడు శ్రీనివాస్‌. ప్రస్తుతం `పలానా అబ్బాయి పలానా అమ్మాయి` పేరుతో తన మార్క్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో తన దర్శకత్వంలో తెరకెక్కిన గత రెండు చిత్రాల్లో హీరోగా నటించిన నాగశౌర్య మరోసారి హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత తెరకెక్కించబోయే సినిమాను కూడా శ్రీనివాస్‌ సిద్ధం చేసి పెట్టుకున్నాడు. నాగశౌర్య సినిమా తరువాత `నాయనా రారా ఇంటికి` పేరుతో ఓ కామెడీ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కించనున్నాడు. Also Read: తాజాగా తాను కీలక పాత్రలో నటిచిన ఊరంతా అనుకుంటున్నారు సినిమా ప్రమోషన్ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఈ యువ నటుడు, దర్శకుడు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. నటుడిగా తన కెరీర్‌లో ఎన్నో మంచిపాత్రలో నటించిన తాను కొన్ని చెత్త సినిమాల్లో కూడా నటించాల్సి వచ్చిందని చెప్పాడు. అలాగే నేను డబ్బు కోసం మాత్రమే సినిమాలు చేయనని చెప్పాడు. తన పాత్ర ప్రేక్షకులకు ఏమేరకు నచ్చుతుంది. ఆ పాత్రలో తాను ప్రూవ్‌ చేసుకునేందుకు ఏమైనా ఉందా అన్నది మాత్రమే ఆలోచిస్తానని చెప్పాడు. అలా అని తాను అన్ని సినిమాలు ఫ్రీగా చేస్తానని చెప్పటం లేదన్న అవసరాల శ్రీనివాస్‌, తనకు కూడా అందరిలాగే ఆర్థిక ఇబ్బందులు ఉంటాయని అందుకే తనకు కూడా డబ్బు అవసరమని అందుకే ఫ్రీగా ఏ పని చేయనని చెప్పాడు. కథా కథనాలు పాత్ర మంచిగా ఉంటే పారితోషికం విషయంలో పెద్దగా పట్టుపట్టనన్నారు. అందుకే ఇటీవల పలు వెబ్‌ సిరీస్‌లు, షార్ట్ ఫిలింస్‌లోనూ తక్కువ రెమ్యూనరేషన్‌కే నటించానని తెలిపాడు. Also Read: సినిమాల జయాపజయాల గురించి మాట్లాడుతూ.. అష్టాచమ్మా యావరేజ్‌ సినిమా అవుతుందనుకున్నా కానీ ఆ సినిమా బ్లాక్‌ బస్టర్‌ అయ్యింది. అలాగే కొన్ని సినిమాలు సూపర్‌ హిట్ అవుతాయనుకున్నా కానీ అవి డిజాస్టర్లు అయ్యాయి. అందుకే ఏ సినిమా ఎందుకు హిట్ అవుతుందో ఎవరూ చెప్పలేరని, మన పని మనం సిన్సియర్‌గా చేసుకుంటూ వెళ్లిపోవటమే అన్నాడు. సీనియర్‌ నరేష్‌ తనయుడు నవీన్‌ విజయ్‌ కృష్ణ హీరోగా తెరకెక్కిన ఊరంతా అనుకుంటున్నారు సినిమాలో మేఘా చౌదరీ, సోఫియా సింగ్‌లు హీరోయిన్లుగా నటించారు. బాలాజీ సనల దర్శకత్వంలో శ్రీహరి మంగళపల్లి, రమ్య గోగుల, పీఎల్‌ఎన్‌ రెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.


By October 06, 2019 at 12:30PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/avasarala-srinivas-said-that-he-was-never-particular-about-the-remuneration/articleshow/71463372.cms

No comments