Breaking News

అనుష్కకి అంత సీన్‌ లేదట.. అందుకే వద్దన్నారు!


దేశం గర్వించదగ్గ దర్శకుల్లో మణిరత్నం ఒకరు. ఎన్నో అద్భుతచిత్రాలతోఆకట్టుకున్న ఈ లెజెండరీ దర్శకుడు కొంత కాలంగా తన స్థాయికి తగ్గ సక్సెస్‌లు సాధిచటంలో ఫెయిల్ అవుతున్నాయి. చాలా కాలం తరువాత ఓకె బంగారం సక్సెస్‌ సాధించినా తరువాత చెలి సినిమాతో మరోసారి నిరాశపరిచాడు. తరువాత వచ్చిన నవాబ్‌ పర్వాలేదనిపించిన మణిరత్నం స్థాయి సక్సెస్‌ మాత్రం సాధించలేకపోయింది. దీంతో తన నెక్ట్స్‌ సినిమాతో ఎలాగైన సత్తా చాటాలని భావిస్తున్నారు మణిరత్నం. అందుకే తన డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియన్‌ సెల్వన్‌ను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు. ప్రముఖ రచయిత కల్కి రాసిన నవల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో తెలుగు, తమిళ, హిందీ భాషలకు చెందిన ప్రముఖ నటులు నటించనున్నారు. Also Read: బాలీవుడ్ లెజెండ్ అమితాబ్‌ బచ్చన్‌, విశ్వసుందరి ఐశ్వర్య రాయ్‌, కోలీవుడ్ స్టార్ హీరోలు విక్రమ్‌, కార్తి, జయం రవి, హీరోయిన్లు నయనతార, కీర్తి సురేష్‌, టాలీవుడ్ సీనియర్‌ నటుడు మోహన్‌ బాబు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా స్వీటీ అనుష్క కూడా నటిస్తుందన్న టాక్‌ వినిపించింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్ నుంచి అనుష్క తప్పుకున్నట్టుగా తెలుస్తోంది. సౌత్‌లో నయనతారకు సమానంగా స్టార్ ఇమేజ్‌ ఉన్న అనుష్క ఈ సినిమాలో నటించేందుకు భారీ మొత్తాన్ని డిమాండ్ చేసిందట. అయితే అంత మొత్తం ఇచ్చేందుకు మణి టీం అంగీకరించలేదు. Also Read: అనుష్కకు అంత పే చేయడం వల్ల సినిమాకు ఆస్థాయిలో లాభం ఉందని భావించి చిత్రయూనిట్ ఆ స్థానంలో మరో తారను తీసుకునే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. చెన్నై చంద్రం త్రిష పేరును పొన్నియన్‌ సెల్వన్‌ టీం పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ వార్తలపై చిత్రయూనిట్ గానీ, అనుష్క గానీ ఎలాంటి ప్రకటనా చేయలేదు. ప్రస్తుతం అనుష్క బహు భాషా చిత్రంగా తెరకెక్కుతున్న నిశబ్ధం సినిమాలో నటిస్తోంది. వస్తాడు నారాజు ఫేం హేమంత్ మధుకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఇంగ్లీష్‌లోనూ రిలీజ్ చేస్తున్నారు. కొంత కాలంగా లుక్‌ విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్న అనుష్క ఈ సినిమాతో మరోసారి ప్రూవ్‌ చేసుకునేందుకు రెడీ అవుతోంది. Also Read:


By October 06, 2019 at 10:29AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/anushka-shetty-exits-mani-ratnams-ponniyan-selvan-film/articleshow/71462327.cms

No comments