Breaking News

హైదరాబాద్ వర్షాలు.. కళ్ల ముందే కొట్టుకెళ్లిన వృద్ధుడు


హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. వర్షాలు, డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేని కారణంగా రోడ్లు నదులను తలపిస్తున్నాయి. రోడ్ల మీది నుంచి భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో ఇప్పటి వరకు బైకులు వరదలో కొట్టుకెళ్లిన ఘటనలను చూశాం. కానీ రోడ్డు మీద భారీ ప్రవహిస్తోన్న వరదలో పడి ఓ వృద్ధుడు కొట్టుకెళ్లాడు. ఈ ఘటన యూసఫ్‌గూడలోని కృష్ణానగర్‌లో చోటు చేసుకుంది. వృద్ధుడు నీటిలో కొట్టుకెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బనియన్, షార్ట్ మీదున్న వృద్ధుడు.. వరదలో కొట్టుకుపోతున్న బైక్‌ను పట్టుకునే క్రమంలో పట్టుజారి కింద పడ్డాడు. వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో.. చూస్తుండగానే కొట్టుకెళ్లాడు. ఆయనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఆయన సురక్షితంగా బయటపడ్డాడా లేదా అనేది తెలియరాలేదు.


By October 01, 2019 at 10:53AM


Read More https://telugu.samayam.com/telangana/news/old-man-drown-in-floods-in-yousufguda-hyderabad/articleshow/71386503.cms

No comments