Breaking News

క్విడ్ ప్రోకో సెక్స్ కుంభకోణం: రోజుకో మలుపు.. వివాదంలో ‘సిట్’!


దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మధ్యప్రదేశ్ క్విడ్ ప్రోకో సెక్స్ కుంభకోణం కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో మాజీ గవర్నర్, మాజీ ముఖ్యమంత్రి, ఎనిమిది మంది మాజీ మంత్రులు, 13 మంది ఐఏఎస్ అధికారులు, జర్నలిస్ట్‌లు ఉన్నట్టు సిట్ దర్యాప్తులో వెలుగుచూసింది. ఈ కేసులో ప్రధాన సూత్రధారులు తమ పనులు చక్కబెట్టుకోడానికి, కాంట్రాక్టులు దక్కించుకోడానికి రాజకీయ నేతలు, అధికారులకు దిగువ మధ్యతరగతికి చెందిన కాలేజీ అమ్మాయిల్ని ఎరగా వేసినట్టు తేలింది. అమ్మాయిలతో వారు ఏకాంతంగా ఉన్నప్పుడు రహస్యంగా వీడియోలు తీసి, వాటి సాయంతో బెదిరింపులకు పాల్పడినట్టు సిట్ విచారణలో వెల్లడయ్యింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ మాజీ ఎంపీకి వలవిసిరిన కి‘లేడీ’లు.. ఆయన ఓ యువతితో సెక్స్‌లో పాల్గొన్నప్పుడు వీడియోలను తీసి బెదిరించారు. ఇలాంటి 30 వీడియోలను చూపి బెదిరింపులకు పాల్పడటంతో ఆయన ఆత్మహత్యాయత్నం కూడా చేశారు. Read Also: తాజాగా, ఈ కేసు విచారణకు ప్రభుత్వం ఏర్పాటుచేసిన ‘సిట్’ కూడా వివాదస్పదమవుతోంది. కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను సెప్టెంబరు 23న మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటుచేసింది. అయితే, వారం రోజుల వ్యవధిలోనే ముగ్గురు అధికారులను మార్చడం వివాదానికి దారితీసింది. ప్రస్తుతం సైబర్ సెల్ డీజీ రాజేంద్ర కుమార్‌ను సిట్ అధికారిగా నియమించారు. సంజీవ్ షామీని తొలగించిన ఆయన స్థానంలో రాజేంద్ర కుమార్‌ను నియమిస్తూ మంగళవారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీచేశారు. దీంతో వారం వ్యవధిలో ముగ్గురు అధికారులు మారడం చర్చనీయాంశమైంది. సెప్టెంబరు 23న సిట్ ఏర్పాటై 24 గంటల గడవక ముందే మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రధాన అధికారిని తప్పించింది. Read Also: మధ్యప్రదేశ్ ఏటీఎస్ చీఫ్ సంజీవ్ షామీకి ఈ బాధ్యతలను అప్పగించింది. అయితే, అనూహ్యంగా మంగళవారం రాత్రి షామీని తప్పించి పోలీసుల నియామకం, ఎంపిక, యాంటీ నక్సల్ ఆపరేషన్ ఏడీజీగా బదిలీచేశారు. సోమవారం రాత్రి అత్యవసరంగా డీజీపీ వీకే సింగ్‌తో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ భేటీ అయిన కొద్ది గంటల్లోనే షామీని బదిలీ చేయడం విశేషం. తాజాగా రాజేంద్ర కుమార్ నాయకత్వంలో ఏర్పాటుచేసిన సిట్‌లో సైబర్ క్రైమ్ ఏడీజీ మిలింగ్ కనాస్కర్, ఇండోర్ ఎస్ఎస్పీ రుచివర్ధన్ మిశ్రాలు సభ్యులుగా ఉన్నారు. దర్యాప్తులో అవసరమైతే అదనపు పోలీసు అధికారి సహాయం కూడా తీసుకోవచ్చని, సిట్‌కు పూర్తిస్థాయిలో సహకరిస్తామని డీజీపీ తన ఉత్తర్వుల్లో వెల్లడించారు. కాగా, ఈ కేసులో డీజీపీ వీకే సింగ్‌‌పై సంచలన ఆరోపణలు చేసిన డీజీ (సైబర్ క్రైమ్) పురుషోత్తమ్ శర్మ సహ పలువుర్ని బదిలీ చేశారు. అయితే, సిట్ ఏర్పడక ముందు హనీట్రాప్ కేసు విచారణకు 24 గంటల్లోనే ముగ్గురు అధికారులు మారారు. సెక్స్ కుంభకోణం బయటపడిన మూడు రోజుల తర్వాత పలాసియా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ అజిత్ సింగ్ తొలిసారి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే, గతంలో డ్రగ్స్ కేసు విషయమై ఆయన నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న కారణంతో ఆయనను తొలగించారు. Read Also: సెక్స్ కుంభకోణం విషయం వెలుగుచూడగానే డీజీపీ వీకే సింగ్ ఘజియాబాద్‌లో తాను ఉంటున్న అపార్ట్‌మెంట్‌ను ఉన్నపళంగా ఖాళీ చేయడంతో పురుషోత్తమ్ శర్మ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ అపార్ట్‌మెంట్‌కు సెక్స్ రాకెట్‌లోని వ్యక్తులతో సంబంధం ఉండటమే కారణమనేది విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో వ్యవహరం మరింత ముదిరింది.


By October 03, 2019 at 11:14AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/ats-chief-sanjiv-shami-was-removed-as-head-of-the-sit-in-madhya-pradesh-honeytrap-scandal-case/articleshow/71418364.cms

No comments