Breaking News

బన్నీ ఖాతాలో మరో రికార్డ్‌.. టాప్‌లో ఫస్ట్‌ సింగిల్‌


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా `అల వైకుంఠపురంలో`. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలోని తొలి పాటకు సూపర్బ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. ఇటీవల విడుదలైన సామజవరగమన పాట యూట్యూబ్‌లో రికార్డ్‌లు సృష్టిస్తోంది. తమన్‌ సంగీతమందించిన ఈ సినిమా పాటకు లెజెండరీ లిరిసిస్ట్‌ సిరివెన్నెల సీతారామశాస్త్రీ సాహిత్యమందించారు. లేటెస్ట్ సెన్సేషన్‌ సిద్‌ శ్రీరామ్‌ ఆలపించిన ఈ పాట విడుదలైన 24 గంటల్లో 6 మిలియన్ వ్యూస్, 313 లైక్స్ సాధించి రికార్డ్‌ సృష్టించింది. గతంలో ఏ తెలుగు పాటకు రాని విధంగా భారీగా లైక్స్‌, వ్యూస్‌ సాధించటంపై చిత్రయూనిట్‌ హర్ష వ్యక్తం చేస్తున్నారు. Also Read: సామజవరగమన పాట విడుదలైన మొదటి 35 నిమిషాల్లో 50 వేల లైక్స్, 88 నిమిషాలకు 1 లక్ష లైక్స్, మూడు గంటల 7 నిమిషాలకు లక్ష 50 వేల లైక్స్, 6 గంటల 12 నిమిషాలకు 2 లక్షల లైక్స్, 10 గంటల 22 నిమిషాలకు 2 లక్షల 50 వేల లైక్స్, 22 గంటల 5 నిమిషాలకు 3 లక్షల లైక్స్ రావడం విశేషం. అలాగే ఇప్పటివరకు ఈ పాటకు 40 మిలియన్స్ వ్యూస్, 7 లక్షల లైక్స్ వచ్చాయి. ఓ తెలుగు పాటు ఇన్ని వ్యూస్‌ ఇన్ని లైక్స్‌ రావటం ఇదే ప్రథమం. Also Read: గీతాఆర్ట్స్‌, హారికా అండ్‌ హాసిని క్రియేషన్స్‌ సంస్థలు నిర్మిస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్‌ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. సీనియర్ నటి టబు, మాలీవుడ్‌ యాక్టర్‌ జయరామ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో యంగ్ హీరో సుశాంత్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.


By October 19, 2019 at 02:57PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/ala-vaikunthapurramlo-first-single-becomes-the-most-liked-telugu-song/articleshow/71661867.cms

No comments