Breaking News

పెళ్లికి నిరాకరించిన ప్రియుడు.. యాసిడ్‌ పోసిన యువతి


ప్రేమ పేరుతో మోసం చేసిన ప్రియుడిపై పగ తీర్చుకుందో యువతి. పెళ్లికి నిరాకరించాడన్న కోపంతో అతడిపై యాసిడ్‌తో దాడి చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌లో జరిగిన ఈ ఘటన కలకలంరేపింది. జీవన్‌ఘర్ ప్రాంతానికి చెందిన యువతి స్థానికంగా ఉండే ఫైజాద్‌ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. తర్వాత ఇద్దరు ప్రేమించుకొని.. చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. యువకుడు కూడా పెళ్లి చేసుకుంటానని ఆమెకు మాయ మాటలు చెప్పాడు. కొద్దిరోజులుగా యువతి తనను పెళ్లి చేసుకోమని ప్రియుడ్ని అడుగుతోంది. దీంతో అతడు నెల రోజులుగా ఆమెతో మాట్లాడకుండా దూరం పెట్టాడు. యువతి ఫోన్ చేస్తున్నా ఫైజాద్ స్పందించకపోవడంతో పగ తీర్చుకోవాలని భావించింది. వెంటనే అదును కోసం ఎదురు చూసింది.. అతడి ఇంటి సమీపంలో నిఘా పెట్టింది. ఫైజాద్ ఇంట్లో నుంచి బయటకు రాగానే తన వెంట తెచ్చుకున్న యాసిడ్ బాటిల్ తీసి అతడిపై పోసింది. వెంటనే అక్కడి నుంచి పారిపోయింది. యాసిడ్ దాడిలో తీవ్రంగా గాయపడిన యువకుడ్ని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. బాధితుడి తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న యువతిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే యువతి రివర్స్‌లో ప్రియుడిపైనే ఆరోపణలు చేస్తోంది. పెళ్లి చేసుకోకపోతే.. ఫైజాద్ తన ఫోటోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడని చెబుతోంది. ఈ ఘటనపై పోలీసులు కూడా ఆరా తీస్తున్నారు.


By October 26, 2019 at 03:21PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/up-girl-throws-acid-on-boyfriend-for-refusing-to-marry-her/articleshow/71773350.cms

No comments