Breaking News

మైనర్ బాలికతో ప్రేమాయణం.. రాత్రి తాళి కట్టి ఉదయాన్నే పరారైన యువకుడు


మైనర్ బాలికను ప్రేమ పేరుతో ముగ్గులోకి దించిన ఓ యువకుడు ఆమెకు తాళి కట్టి మొహం చాటేసిన ఘటన జిల్లాలో చోటుచేసుకుంది. మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ బాలిక ఇంటర్ సెకండియర్ చదువుతోంది. రోజూ ఇంటి నుంచి కాలేజీకి సైకిల్‌పై వెళ్లి వస్తుంటుంది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన వెంకటేశ్ అనే యువకుడు ఆమెపై కన్నేశాడు. Also Read: రోజూ ఆ బాలికతో మాట్లాడుతూ ప్రేమలోకి దించాడు. ఆమెను పార్కులకు, సినిమాలకు తీసుకెళ్లేవాడు. మన ప్రేమను పెద్దలు ఒప్పుకోరని, అందుకే ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేసుకుందామంటూ సుమారు నాలుగు నెలలుగా ఆమెపై ఒత్తిడి తెస్తున్నాడు. ఎట్టకేకల బాలిక సరేననడంతో గురువారం రాత్రి గ్రామ సమీపంలోని కొండపై ఉన్న అమ్మవారి ఆలయానికి ఆమెను తీసుకెళ్లి తాళి కట్టాడు. Also Read: మనం భార్యభర్తలయ్యాం కాబట్టి నీ సర్వస్వం నాదేనంటూ ఆమెపై అక్కడే లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఇద్దరూ ఆలయంలోనే పడుకున్నారు. శుక్రవారం ఉదయం బాలిక నిద్రలేచి చూసేసరికి వెంకటేశ్ కనిపించలేదు. అతడి ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ రావడంతో మోసపోయానని గ్రహించింది. వెంటనే ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు విషయం చెప్పింది. దీంతో వారు తమ కూతురిని వెంటబెట్టుకుని పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. Also Read: గమనిక: అత్యాచారాలు, లైంగిక వేధింపుల కేసుల్లో బాధితులకు సంబంధించి గోప్యత పాటించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వారి పేర్లు, వివరాలు వెల్లడించడంలేదు.


By October 13, 2019 at 09:10AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/srikakulam-man-booked-for-cheats-minor-girl-with-wedding-drama/articleshow/71561934.cms

No comments