Breaking News

`ఆటో రజని` కోసం ఆంధ్రప్రదేశ్‌ సీఎం


ప్రేమెంత పనిచేసే నారాయణ సినిమాతో ఆకట్టుకున్న యువ నటుడు జొన్నలగడ్డ హరికృష్ణ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ఆటో రజని. ఈ సినిమాను జేఎస్‌ఆర్‌ మూవీస్ పతాకంపై బి.లింగుస్వామి సమర్పణలో జొన్నలగడ్డ శ్రీనివాస్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఈ సినిమా పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతుందని చిత్రయూనిట్ వెల్లడించారు. Also Read: హరికృష్ణ రెండవ సినిమాగా వస్తున్న ఈ మూవీకి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆశీస్సులు అందించారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాత జొన్నలగడ్డ శ్రీనివాస్‌ సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. తాడేపల్లిలోనివ వైఎస్‌ఆర్సీపీ కార్యాలయంలో జగన్‌ను కలిసిన హీరో హరికృష్ణ ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. Also Read: తన తొలి ప్రయత్నం ప్రేమెంత పనిచేసే నారాయణ సినిమాను ఆశీర్వదించినట్టుగానే ఈ ఆటో రజనినీ కూడా ఆశీర్వదించాలని ముఖ్యమంత్రిని కోరారు. అలాగే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. హీరోయిన్‌తో పాటు ఇతర నటీనటుల సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.


By October 13, 2019 at 11:25AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/ap-cm-ys-jaganmohanreddy-launches-auto-rajini-film/articleshow/71562884.cms

No comments