Breaking News

ఇంట్లో మందు పార్టీ వద్దన్న భార్య.. తిట్టడంతో ఉరేసుకుని ఆత్మహత్య


ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త అనుమానపు చేష్టలు భరించలేక ఆత్మహత్య చేసుకున్న ఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. శ్రీకాకుళం జిల్లా వంగర మండలం కొండచాకరపల్లి గ్రామానికి చెందిన పెనుపోతు గీత (20) కొండాపూర్‌లోని గూగుల్‌ సంస్థలో హౌజ్‌ కీపింగ్‌ విభాగంలో పనిచేస్తోంది. అదే సంస్థలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న విజయ్‌తో స్నేహం ఏర్పడి అదికాస్తా ప్రేమకు దారితీసింది. Also Read: వీరిద్దరి పెళ్లికి పెద్దలు అడ్డు చెప్పగంతో ఐదు నెలల క్రితం బల్కంపేటలోని ఆర్యసమాజ్‌లో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం బంజారాహిల్స్‌లోని రోడ్ నంబర్ 12 ఎన్బీటీ నగర్‌లో అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. ప్రస్తుతం గీత మూడు నెలల గర్భిణి. మంగళవారం తన పుట్టినరోజు కావడంతో విజయ్ స్నేహితులను ఇంటికి పిలిచి మందు పార్టీ ఇచ్చాడు. ఇంట్లో అలాంటి పార్టీలు పెట్టొద్దని గీత చెప్పగా విజయ్ ఆగ్రహంతో ఊగిపోయాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. Also Read: బుధవారం సాయంత్రం విధుల నుంచి ఇంటికి వచ్చిన గీత మనస్తాపంతో గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కొద్దిసేపటి తర్వాత ఇంటికి వచ్చిన విజయ్ షాకై వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో వారు శ్రీకాకుళంలో ఉంటున్న గీత తల్లిదండ్రులకు సమాచారమిచ్చాడు. విజయ్ తమ కుమార్తెను తీవ్రంగా వేధిస్తున్నాడని, ఇదే విషయం తమకు ఎన్నోసార్లు ఫోన్ చేసి చెప్పిందని వారు పోలీసులకు తెలిపారు. దీంతో బంజారాహిల్స్ పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. Also Read:


By October 18, 2019 at 10:31AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/hyderabad-pregnant-woman-suicide-commits-suicide-over-family-disputes/articleshow/71642949.cms

No comments