Breaking News

ఫ్యాన్స్‌ అంటే వాళ్లే.. అప్పుడు సాహో ఇప్పుడు సైరా!


దక్షిణాది తారలకు అభిమానులు ఏ స్థాయిలో ఉంటారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తమ అభిమాన నటుడి కోసం ఏమయినా చేసేంత పిచ్చి అభిమానుల్లో చాలా సందర్భాల్లో చూస్తుంటాం. ఇక తమ అభిమాన కథనాయకుడి సినిమా విడుదలవుతుందటే వారి సందడికి అంతే ఉండదు. కటౌట్‌లు, ఫెక్సీలతో పాటు థియేటర్లను ముస్తాబు చేస్తూ ఆనందపడిపోతుంటారు ఫ్యాన్స్‌. ఒక హీరో అభిమానులను మించి మరో హీరో అభిమానులు కటౌట్లు, ఫెక్లీల ఏర్పాట్లకు ఖర్చు చేస్తుంటారు. తాజాగా అలాంటి పరిస్థితే భీమవరంలో కనిపిస్తుంది. ఇటీవల సాహో రిలీజ్‌ సమయంలో యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ ఫ్యాన్స్‌, దారిపోడువునా ఓ భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. Also Read: ఇప్పుడు సైరా రిలీజ్‌ సమయంలోను మెగా అభిమానులు అలాంటి ఫ్లెక్సీనే ఏర్పాటు చేశారు. దారి పొడవునా సైరా సినిమాలోని చిరంజీవి స్టిల్స్‌తో పాటు ప్రమోషన్‌ వేడుకల్లోని స్టిల్స్‌తో ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. దాదాపు 250 అడుగుల ఈ కటౌట్‌పై మెగా కోడలు ఉపాసన కూడా స్పందించారు. భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన అభిమానులకు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. అయితే గతంలో ఇలాంటి ఫ్లెక్సీ ఏర్పాటు విషయంలో వివాదాలు జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ ఈ సారి మాత్రం అలాంటి వివాదాలకు తావివ్వకుండా మెగా అభిమానులు జాగ్రత్తలు తీసుకున్నారు. మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ బ్యానర్‌పై చిరు తనయుడు రామ్‌ చరణ్‌ ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. భారీ స్టార్‌ కాస్ట్‌తో 270 కోట్ల బడ్జెట్‌ రూపొందించిన ఈ సినిమా గాంధీ జయంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.


By October 02, 2019 at 11:12AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/saira-narasimha-reddy-mega-fans-craze-in-bhimavaram/articleshow/71404008.cms

No comments