Breaking News

భర్తపై కోపంతో కన్నకొడుకుని చంపి.. యాసిడ్ తాగేసిన మహిళ


భర్తతో మనస్పర్థల కారణంగా కొన్నాళ్లుగా పుట్టింట్లోనే ఉంటున్న మహిళ దారుణానికి పాల్పడింది. తన కొడుకుని భర్త వద్దకు పంపడం ఇష్టం లేక కన్నప్రేమనే మరిచి బాలుడి ప్రాణం తీసింది. అనంతరం భయంతో తాను కూడా యాసిడ్ తాగింది. Also Read: నల్గొండ జిల్లా చింతపల్లి మండలం వర్కాలకు చెందిన అంతిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి-సునీత దంపతుల కుమారై శివరాణిని నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తి మండలం బెక్కరకు చెందిన పోతుల శివారెడ్డికి ఇచ్చి వివాహం చేశారు. వీరికి యశ్వంత్‌రెడ్డి(5) అనే కుమారుడు ఉన్నాడు. భర్తతో విబేధాల కారణంగా శివరాణి కొంతకాలంగా పుట్టింట్లోనే ఉంటోంది. ఇటీవల శివరాణి పేరిట ఆమె తల్లిదండ్రులు ఐదెరకాల పొలం రాశారు. దీంతో ఆ పొలం అమ్మేసి తనకు డబ్బు ఇవ్వాలంటూ శివారెడ్డి వేధిస్తున్నాడు. Also Read: ఈ క్రమంలోనే దీపావళి పండుగకు తన వద్దకు రావాలని శివారెడ్డి రెండ్రోజుల క్రితం భార్యకు ఫోన్ చేశాడు. ఆమె రానని చెప్పడంతో కొడుకునైనా పంపాలని బెదిరించాడు. అవసరమైతే కొడుకునే చంపేస్తాను గానీ.. నీ దగ్గరికి మాత్రం పంపను అని శివరాణి భర్తకు తెగేసి చెప్పింది. కొడుకును ఎలా తెచ్చుకోవాలో తనకు తెలుసని శివారెడ్డి కూడా ఎదురు సమాధానం చెప్పాడు. భర్త తన కొడుకును తీసుకెళ్లిపోతాడేమోనన్న ఆందోళనతో శివరాణి శుక్రవారం రాత్రి బాత్రూమ్ క్లీన్ చేసే యాసిడ్‌ను కొడుక్కి తాగించింది. Also Read: యశ్వంత్‌రెడ్డి చనిపోవడంతో భయపడిన ఆమె శనివారం ఉదయం తాను కూడా యాసిడ్ తాగేసి పోలీసులకు ఫోన్ చేసి చెప్పింది. దీంతో వారు వెంటనే అక్కడికి చేరుకుని శివరాణిని అరెస్ట్ చేసి ఆస్పత్రికి తరలించారు. యశ్వంత్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. భర్తపై కోపంతో కన్నకొడుకునే చంపేసిన శివరాణిపై స్థానికులు మండిపడుతున్నారు. Also Read:


By October 27, 2019 at 01:07PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/telangana-woman-kills-5-yr-old-son-due-to-family-diaputes/articleshow/71783523.cms

No comments