Breaking News

అక్క ఇంటికొచ్చిన బాలికను గర్భవతిని చేసిన బావ


సెలవుల కోసం అక్క ఇంటికి వచ్చిన యువతి జీవితాన్ని నాశనం చేశాడో కామాంధుడు. భార్య చెల్లెలపై తనకు హక్కు ఉంటుందన్న దురాలోచనతో మరదలిని లొంగదీసుకుని అనేకసార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఫలితంగా బాధితురాలు గర్భం దాల్చింది. Also Read: ఒడిశాలోని ఓ గ్రామానికి చెందిన ఓ బాలిక పట్టణంలోని ఓ కాలేజీలో ఇంటర్ చదువుకుంటూ హాస్టల్‌లో ఉంటోంది. ఆమెకు అక్కకు పెళ్లయి భర్తతో అదే పట్టణంలో నివసిస్తోంది. దీంతో ఆ బాలిక కాలేజీకి సెలవులు ఇచ్చినప్పుడల్లా అక్క ఇంటికి వెళ్లి ఉండేది. ఈ క్రమంలోనే బాలికపై అక్క మొగుడు కన్నేశాడు. ఆమెకు అవసరం ఉన్న వస్తువులన్నీ కొనిస్తూ చనువు పెంచుకున్నాడు. ఓ రోజు బాలిక ఇంటికి వచ్చిన సమయంలో అక్క లేకపోవడంతో అతడు మరదలిని బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. Also Read: ఈ విషయం ఎవరికైనా చెబితే మీ అక్కను వదిలేస్తాను, అందరినీ చంపేస్తానని బెదిరించాడు. దీంతో ఆ బాలిక ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా మౌనంగా ఉండిపోయింది. దీంతో మరింత రెచ్చిపోయిన ఆ కామాంధుడు మరదలిని ప్రతి సెలవులకు తానే హాస్టల్‌ నుంచి తీసుకొచ్చి వీలు చిక్కినప్పుడల్లా బెదిరించి అత్యాచారం చేశాడు. ఇటీవల బాలిక క్షీణించడంతో తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయింది. బాలికకు శనివారం తీవ్రమైన కడుపునొప్పి రావడంతో వారు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనుమానం వచ్చిన డాక్టర్ పరీక్ష చేయగా గర్భవతి అని తేలింది. Also Read: దీంతో తల్లిదండ్రులు బాలికను నిలదీయగా అక్క ఇంటికి వెళ్లినప్పుడు బావ బెదిరించి అనేకసార్లు అత్యాచారం చేశాడని చెప్పడంతో వారు దిగ్భ్రాంతి చెందారు. బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న కటక్ పోలీసులు ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీనిపై దర్యాప్తు చేసి నిందితుడిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. Also Read: గమనిక: అత్యాచారాలు, లైంగిక వేధింపుల కేసుల్లో బాధితులకు సంబంధించి గోప్యత పాటించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వారి పేర్లు, వివరాలు వెల్లడించడంలేదు.


By October 14, 2019 at 11:11AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/odisha-man-rapes-wifes-sister-several-times-she-is-conceived/articleshow/71575135.cms

No comments