Breaking News

మహిళలు స్నానం చేస్తుండగా తొంగి చూస్తున్న యువకుడి అరెస్ట్


మహిళలు స్నానం చేస్తున్నప్పుడు, బట్టలు మార్చుకుంటున్నప్పుడు కిటికీలో నుంచి తొంగి చూస్తున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆరు నెలలుగా తప్పుడు పనులు చేస్తూ తప్పించుకుని తిరుగుతున్న అతడిని ఆదివారం మహిళలందరూ కలిసి పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. Also Read: బెంగళూరులోని శాంతినగర్‌లో గల ఓ అపార్ట్‌మెంట్లో నివసించే ఓ యువకుడు సమీప ప్లాట్లలోని మహిళలు స్నానం చేస్తున్నప్పుడు తొంగి చూడటం అలవాటు చేసుకున్నాడు. ఈ విషయాన్ని మహిళలు గమనించినా నిందితుడు ఎప్పటికప్పుడు తప్పించుకుంటున్నాడు. దీంతో అతడిని ఎలాగైనా పట్టుకోవాలని మహిళలంతా ప్లాన్ వేశారు. అపార్ట్‌మెంట్‌లోని మహిళలందరూ ఓ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకుని స్థానిక పోలీసులను కూడా అందులో చేర్చారు. Also Read: ఎప్పటికప్పుడు తమకు ఎదురైన అనుభవాలను అందులో పోస్ట్ చేసేవారు. ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో ఓ మహిళ బాత్రూమ్‌లో స్నానం చేస్తుండగా ఓ వ్యక్తి తొంగి చూడటం గమనించింది. వెంటనే ఆమె కేకలు వేయగా నిందితుడు పరారయ్యాడు. ఈ విషయాన్ని ఆమె వాట్సాప్ గ్రూపులో పోస్ట్ చేయగానే మిగతా మహిళలందరూ బయటకు వచ్చి ఈ కామాంధుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఈ విషయం పోలీసులకు చేరడంతో వారు వెంటనే అక్కడికి చేరుకుని అతడిని అరెస్ట్ చేశారు. నిందితుడు సుమారు ఆరు నెలలుగా మహిళలను వేధిస్తు్న్నట్లు పోలీసులు తెలిపారు. వాడి పీడ తొలగిపోవడంతో మహిళలంగా హర్షం వ్యక్తం చేశారు. Also Read: Also Read:


By October 18, 2019 at 09:22AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/bengaluru-man-arrested-for-looking-as-women-take-a-bath-and-chage-dress/articleshow/71642251.cms

No comments