Bihar: తాజా ప్రియుడి సాయంతో మాజీ ప్రియుడి దారుణహత్య

ఓ వ్యక్తితో ఐదేళ్లు సహజీవనం చేసిన మహిళ.. మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుని మొదటి ప్రియుడిని వదిలేసింది. భవిష్యత్తులో అతడి నుంచి ఎలాంటి ఇబ్బంది రాకుండా తాజా ప్రియుడితో అతడిని దారుణంగా చంపేసింది. బిహార్‌లోని ముంగేర్ జిల్లాలో వెలుగుచూసిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. Also Read: కరణ్‌కుమార్ అనే వ్యక్తి కనిపించడం లేదని అక్టోబర్ 5వ తేదీన అతడి తండ్రి ధర్మేంద్ర ముంగేర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ నెల 25వ తేదీన టెంటియా బంబర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ పొలంలో కరణ్‌కుమార్ మృతదేహాన్ని కనుగొన్నారు. సంఘటనా స్థలంలో మృతుడి ఫోన్ లభించడంతో అతడి కాల్‌డేటాను పరిశీలించారు. కరణ్‌కుమార్ చివరిగా రవీనా అనే మహిళతో మాట్లాడినట్లు గుర్తించి ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా తానే హత్య చేసినట్లు అంగీకరించింది Also Read: రవీనా-కరణ్‌కుమార్ ఐదేళ్ల పాటు సహజీవనం చేశారు. ఆ తర్వాత ఆమెకు పాశ్వాన్ అనే యువకుడు పరిచయం కావడంతో కరణ్‌ను వదిలేసి కొత్త ప్రియుడితో ఉంటోంది. వీరిద్దరూ సుమారు నాలుగేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. అయితే ఇటీవల తనతో సంబంధం కొనసాగించాలని కరణ్.. రవీనాను ఒత్తిడి చేస్తున్నాడు. తనకు ఇష్టం లేదని ఆమె చెప్పినా వినకుండా వేధిస్తున్నాడు. దీంతో రవీనా మాజీ ప్రియుడిని అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. ప్రియుడితో పాటు అతడి ముగ్గురు ఫ్రెండ్స్ సాయంతో ప్లాన్ వేసింది. Also Read: మాట్లాడుకుందాం రమ్మంటూ రవీనా పిలవడంతో కరణ్‌కుమార్‌ను ఓ చోటికి పిలిచింది. అక్కడే పాశ్వాన్‌తో పాటు అతడి స్నేహితులు కుమార్, రవి, సోనూకుమార్ కలిసి కరణ్‌ను కొట్టి చంపేసి ఓ పొలంలో పడేసి వెళ్లిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ అనంతరం రవీనా, పాశ్వాన్‌తో పాటు మిగిలిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. Also Read:
By October 28, 2019 at 09:15AM
No comments