Breaking News

కన్నతండ్రి కాదు కామాంధుడు.. 9ఏళ్ల కూతురిపైనే అత్యాచారయత్నం


కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్న కూతురిపైనే అత్యాచారానికి యత్నించాడో కామాంధుడు. వావి వరుసలు మరిచి తన రక్తం పంచుకుని పుట్టిని బాలికపైనే లైంగిక దాడికి యత్నించాడు. అయితే చాకచక్యంగా వ్యవహరించిన బాలిక ఆ కామాంధుడి చెర నుంచి తప్పించుకుని పక్కటింకి వెళ్లి విషయం చెప్పింది. స్థానికులకు దొరికితే తనకు దేహశుద్ధి ఖాయమనుకున్న ఆ నీచుడు అక్కడి నుంచి పరారయ్యాడు. Also Read: హైదరాబాద్‌ ఎస్సార్‌నగర్ పరిధిలోని బోరబండకు చెందిన ఓ వ్యక్తి కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతడికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె(9) ఉన్నారు. మంగళవారం ఇంట్లో ఒంటరిగా ఉన్న కుమార్తెపై ఆ కామాంధుడు అత్యాచారం చేయబోయాడు. కన్నతండ్రే తన జీవితాన్ని చెరబట్టాలని చూస్తున్న దారుణాన్ని పసిగట్టిన బాలిక అక్కడి నుంచి తప్పించుకుని పక్కింటికి పరుగులు తీసి విషయం చెప్పింది. తన బండారం బయటపడటంతో నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. Also Read: కాసేపటికి ఇంటికి వచ్చిన తల్లికి బాలిక విషయం చెప్పడంతో ఆమె ఎస్సార్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కన్నకూతురిపైనే అఘాయిత్యానికి యత్నించిన తన భర్తపై కఠినచర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొంది. నిందితుడిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు. Also Read: గమనిక: అత్యాచారాలు, లైంగిక వేధింపుల కేసుల్లో బాధితులకు సంబంధించి గోప్యత పాటించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వారి పేర్లు, వివరాలు వెల్లడించడంలేదు.


By October 16, 2019 at 09:40AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/man-booked-for-rape-attempt-on-9-yr-old-daughter-in-hyderabad/articleshow/71608110.cms

No comments