Breaking News

మహిళ స్నానం చేస్తుండగా వీడియో తీసి రూ.5లక్షలు డిమాండ్


వివాహిత స్నానం చేస్తుండగా రహస్యంగా వీడియో తీసిన ప్రబుద్ధుడిపై జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. కొత్తపేటకు చెందిన ఆత్రేయవరపు వెంకట నాగ సాయికృష్ణ అనే యువకుడు తన ఇంటి సమీపంలో ఉండే వివాహితపై కన్నేశాడు. ఆమె చూస్తుండగా అసభ్య చేష్టలకు పాల్పడేవాడు. ఈ విషయాన్ని ఆమె భర్తకు చెప్పగా ఆయన సాయికృష్ణను మందలించాడు. Also Read: దీంతో కక్ష పెంచుకున్న సాయికృష్ణ ఇటీవల ఆ మహిళ స్నానం చేస్తుండగా రహస్యంగా సెల్‌ఫోన్లో వీడియో తీశాడు. దాన్ని ఆమె‌కు చూపించి రూ.5లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. తన దగ్గర అంత డబ్బు లేదని ఆమె చెప్పినా పట్టించుకోలేదు. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే ఆ వీడియోను సోషల్‌మీడియాలో అప్‌లోడ్ చేస్తానని బెదిరించాడు. Also Read: దీంతో బాధితురాలు భర్తకు విషయం చెప్పింది. దీంతో ఆయన సోమవారం భార్యతో కలిసి కొత్తపేట పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి సాయికృష్ణపై ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సాయికృష్ణ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, త్వరలోనే అతడిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. Also Read:


By October 01, 2019 at 11:11AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/east-godavari-man-films-woman-bathing-demands-rs-5lacs/articleshow/71386822.cms

No comments