4ఏళ్ల బాలికపై అత్యాచారయత్నం.. వృద్ధుడికి 20 ఏళ్ల జైలు

మనవరాలి వయస్సున్న బాలికపై చేసిన వృద్ధ కామంధుడికి కోర్టు కఠినశిక్ష విధించింది. 20ఏళ్ల జైలుశిక్షతో పాటు రూ.వెయ్యి జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. Also Read: హైదరాబాద్ పాతబస్తీలోని లాల్‌దర్వాజా జగదీశ్ మందిర్ ప్రాంతంలో మునిగాల సురేందర్(62) అనే వృద్ధుడు నివసిస్తున్నాడు. 2018, అక్టోబర్ 25న ఇంటి పక్కన ఉండే నాలుగన్నరేళ్ల బాలికను చాక్లెట్లు ఇస్తానని చెప్పి గదిలోకి తీసుకెళ్లాడు. దుస్తులు విప్పి లైంగిక దాడికి పాల్పడేందుకు యత్నిస్తుండగా పాప గట్టిగా ఏడ్చింది. దీంతో స్థానికులు అతడికి ఇంట్లోకి ప్రవేశించి బాలికను రక్షించారు. Also Read: బాలిక తల్లి శాలిబండ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఈ కేసు విచారించిన ఫస్ట్ అడిషనల్ మెట్రోపాలిటన్ జడ్జి బుధవారం తుది తీర్పు ఇచ్చారు. నిందితుడికి 20ఏళ్ల జైలుశిక్ష, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. Also Read:
By October 17, 2019 at 08:40AM
No comments