Breaking News

పాక్‌తో చర్చలకు అదొక్కటే మిగిలింది.. ఆ 300 మందితోనే సమస్య: రాం మాధవ్


కశ్మీర్ సమస్యను అంతర్జాతీయం చేయాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తుండగా.. భారత్ మాత్రం ఇది అంతర్గత వ్యవహారం అని తేల్చి చెబుతోంది. పాకిస్థాన్‌తో చర్చల ప్రసక్తే లేదంటున్న భారత్.. దాయాదితో చర్చలంటూ జరిపితే అది పాక్ ఆక్రమిత కశ్మీర్ కోసమేనంటోంది. మాతో పెట్టుకుంటే అణు యుద్ధం తప్పదని హెచ్చరిస్తోన్న ఇమ్రాన్ ఖాన్‌కు బీజేపీ నేతలు ఘాటుగా సమాధానం ఇస్తున్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ ఈ అంశంపై మాట్లాడుతూ.. ఇక దాయాదితో చర్చలు జరపడం కోసం మిగిలిన ఏకైక అంశం.. పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను భారత్‌కు అప్పగించడమే అన్నారు. అంతకు మించి మరో అంశంపై చర్చలు జరపాల్సిన అవసరం లేదన్నారు. కశ్మీర్లో కర్ఫ్యూ అమల్లో ఉందని, వేల మంది బందీలుగా ఉన్నారన్న పాక్ ప్రధాని ఆరోపణలను ఖండించారు. ప్రస్తుతం 200-300 మందిని మాత్రమే అదుపులోకి తీసుకున్నామన్నారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో మాట్లాడిన రాం మాధవ్.. ఆర్టికల్ 370 రద్దు సమయంలో 2000-3000 మందిని అదుపులోకి తీసుకున్నామని.. ప్రస్తుతం 200-300 మంది మాత్రమే అదుపులో ఉన్నారని తెలిపారు. కశ్మీర్‌ల కోరికకు, ఈ 200-300 కోరికకు చాలా తేడా ఉందన్నారు. Read Also: 200-250 మందిని అదుపులో తీసుకుంటే రెండు నెలలుగా కశ్మీర్ శాంతియుతంగా ఉందన్న రాం మాధవ్.. కశ్మీర్ ప్రజలు ఏం కోరుకుంటున్నారో, వీరేం కోరుకుంటున్నారో అర్థం చేసుకోవాలన్నారు.


By October 01, 2019 at 10:16AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/only-issue-left-to-discuss-with-pakistan-is-pok-bjp-general-secretary-ram-madhav/articleshow/71386024.cms

No comments