RRR: వారికి సర్‌ప్రైజ్ ఇవ్వనున్న తారక్
దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం భాషల్లోనూ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే తెలుగులో ఎటూ తారక్ తనసొంత వాయిస్‌తోనే డైలాగులు చెప్తారు. అయితే తమిళం, హిందీ, మలయాళ భాషల్లోనూ ఆయన డబ్బింగ్ చెప్పబోతున్నారట. ఈ మేరకు టాలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం తారక్‌కు సంబంధించిన చిత్రీకరణ బల్గేరియాలో జరుగుతోంది. ఇప్పుడు జరుగుతున్న షూటింగ్‌లో తారక్‌తో పాటు జూనియర్ ఆర్టిస్ట్‌లకు సంబంధించిన షాట్స్ తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. మరోపక్క రామ్‌చరణ్ తన పాత్రకు సంబంధించి రిహార్సల్‌తో బిజీగా ఉన్నారు. ఇందులో తారక్ కొమరం భీమ్ పాత్రలో చరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్రలో నటిస్తున్నారు. చరణ్‌కు జోడీగా ఆలియా భట్ నటిస్తున్నారు. తారక్ హీరోయన్‌కు సంబంధించి చిత్రబృందం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దానయ్య దాదాపు రూ.250 కోట్లు పెట్టి సినిమాను తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది జులై 30న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అక్టోబర్ 22న తారక్ పాత్రకు సంబంధించిన లుక్‌ను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
By September 03, 2019 at 10:42AM
No comments