Nani Gang Leader: ‘గ్యాంగ్ లీడర్’ సాంగ్: సీన్ చిరిగి.. సీటులిరిగి చితక్కొట్టారోయ్!
‘జెర్సీ’తో ఎమోషనల్ బ్లాక్ బస్టర్ అందుకున్న నేచురల్ స్టార్ .. ‘గ్యాంగ్ లీడర్’గా ఈనెల 13న ప్రేక్షకుల ముందుకురాబోతున్నారు. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహించిన ఈ రిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ‘గ్యాంగ్ యు అనే ప్రమోషనల్ సాంగ్ విడుదలైంది. ‘జెర్సీ’తో నానికి మ్యూజికల్ హిట్ ఇచ్చిన అనిరుధ్ మరోసారి మెస్మరైజ్ చేశారు. ‘సీన్ చిరిగి.. సీటులిరిగి గ్యాంగ్ యు లీడర్’ అంటూ గొంతువిప్పిన అనిరుధ్.. నానితో కలిసి స్టెప్పులకు ఇరగదీశాడు. గ్యాంగ్.. గ్యాంగ్ వచ్చాడు చూడండోయ్ అంటూ ఊపునిచ్చే బీట్‌తో షేక్ చేశాడు. అనంత్ శ్రీరామ్ లిరిక్స్ అందించగా.. అనురుధ్ స్వయంగా పాడారు. ఈ చిత్రంలో ప్రియాంక, లక్ష్మి, శరణ్య, అనీష్ కురువిళ్లా ప్రధాన పాత్రలు పోషించారు. ‘RX 100’ ఫేమ్ కార్తికేయ ప్రతినాయకుడిగా కనిపించబోతున్నారు. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్ చెరుకూరి(సీవీఎం) నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నాడు మన ‘గ్యాంగ్ లీడర్’.
By September 06, 2019 at 11:21AM
No comments