Breaking News

Kartikeya 90ML: ‘90ML’ టీజర్: హే స్టడీ! చీప్ లిక్కర్ ఎక్కేస్తోంది


‘RX 100’ చిత్రంతో కెరియర్ స్టార్టింగ్‌లోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కార్తికేయ బర్త్ డే సందర్భంగా నేడు (సెప్టెంబర్ 21) ఆయన నటిస్తున్న ‘90ML’ మూవీ టీజర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ టీజర్‌లో ‘‘రేయ్.. డీజిల్‌తో నడిచే బండ్లను చూసి ఉంటావు.. పెట్రోల్‌తో నడిచే బండ్లను చూసి ఉంటావ్.. ఇది లిక్కర్‌తో నడిచే బండి గుద్దితే అడ్రస్ ఉండదు’ అంటూ కార్తికేయ పచ్చి తాగబోతుగా కనిపిస్తున్నారు. ఈ తాగుబోతోడు పూటకో 90ML మాత్రమే వేస్తాడట.. ఎందుకు క్వాటర్ ఇస్తే వేయవా అంటే ‘డాక్టర్ 90ML మాత్రమే తాగమన్నాడు’ అంటున్నాడు. మరి ఇతనికి ఏం రోగం ఉందో తెలియదు కాని.. మాత్రం ఫుల్ పటాస్‌లా మంచి కిక్ ఇచ్చేట్టుగానే ఉంది. హీరో కార్తికేయ సొంత బ్యానర్ కార్తికేయ క్రియేటివ్ వర్క్స్‌లో వస్తున్న ఈ చిత్రానికి అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నిషా సొలంకీ హీరోయిన్‌గా నటిస్తోంది. శేఖర్ రెడ్డి యర్రా రచన, దర్శకత్వం వహిస్తుండగా.. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించారు. RX100 సినిమాతో హిట్ అందుకున్న కార్తికేయ మళ్ళీ హోమ్ బ్యానర్‌లో చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ అంచనాలకు తగ్గట్టుగానే 90ML టీజర్ మంచి కిక్ ఇచ్చేట్టుగానే ఉంది. హిప్పీ, గుణ 369 వంటి వరుస పరాజయాల తరువాత కార్తికేయను ‘90ML’ హిట్ ట్రాక్ హిట్ ట్రాక్ ఎక్కించేట్టుగానే కనిపిస్తోంది. ఈ తాగుబోతు టీజర్‌పై మీరూ ఓ లుక్కేయండి.


By September 21, 2019 at 01:43PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/kartikeyas-90ml-telugu-movie-teaser-full-kick/articleshow/71231812.cms

No comments